హామీల అమలులో కేసీఆర్‌ విఫలం

ABN , First Publish Date - 2022-09-19T06:10:57+05:30 IST

హామీల అమలు లో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని కాంగ్రెస్‌ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల ఐలయ్య అన్నారు. రాహుల్‌గాంధీ చేపడుతున్న భార త్‌ జోడో యాత్రకు మద్దతుగా ఆదివారం మండలంలోని మహబూబ్‌పేట గ్రామం నుంచి పాదయాత్రను ఆయన ప్రారంభించి మా ట్లాడారు.

హామీల అమలులో కేసీఆర్‌ విఫలం
గుట్ట మండలంలో కొనసాగుతున్న పాదయాత్ర

కాంగ్రెస్‌ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట రూరల్‌, సెప్టెంబరు 18: హామీల అమలు లో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని కాంగ్రెస్‌ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల ఐలయ్య అన్నారు. రాహుల్‌గాంధీ చేపడుతున్న భార త్‌ జోడో యాత్రకు మద్దతుగా ఆదివారం మండలంలోని మహబూబ్‌పేట గ్రామం నుంచి పాదయాత్రను ఆయన ప్రారంభించి మా ట్లాడారు. సెపెంబరు 17ను విమోచన దినంగా బీజేపీ, జాతీయ సమైక్యతా దినోత్సవంగా టీఆర్‌ఎ్‌సలు కలిసి రాజకీయ లబ్ధికోసం వెంపర్లాడుతున్నాయని, ఆయా పార్టీలకు రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ది చెప్పాలన్నారు. దేశానికిస్వాతంత్య్రం సాధించిన కాంగ్రెస్‌ పార్టీయే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని, దళతబంధు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారని, వాటిని అమలు చేయడం మాత్రం మరిచారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీలు చీర శ్రీశైలం, గంధమల్ల అశోక్‌, సర్పంచ్‌ కానుగు కవిత, పార్టీ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజ్‌గౌడ్‌, గుండ్లపల్లి భరత్‌గౌడ్‌, నమిలే మహేందర్‌గౌడ్‌, గుండు జ్యోతి, శేఖర్‌, మిట్ట రాంచందర్‌గౌడ్‌, బొజ్జ సాంబేష్‌ పాల్గొన్నారు.


రానున్న ఎన్నికల్లో కాంగ్రె్‌సదే విజయం 

ఆలేరు రూరల్‌: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని బీర్ల అయిలయ్య అన్నారు. మండలంలోని పలు పార్టీలకు చెందిన నాయకులు ఆదివారం ఆయన సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాల్లోని మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాలను పడగొట్టడమే కాంగ్రెస్‌ పార్టీ ముందున్న లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రాజు, ఎంపీపీ గంధమల్ల అశోక్‌, వైస్‌ఎంపీపీ గాజుల లావణ్య తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-09-19T06:10:57+05:30 IST