అమరుల కుటుంబాలను మోసం చేసిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-07-05T06:00:26+05:30 IST

రాష్ట్రం కోసం పోరాడిన అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్‌ మో సం చేశారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించా రు.

అమరుల కుటుంబాలను మోసం చేసిన కేసీఆర్‌
హుజూర్‌నగర్‌ బహిరంగ సభలో వైయస్‌ షర్మిల

కవితకు ఎమ్మెల్సీ ఇచ్చి,  శంకరమ్మను విస్మరించారు

 వైఎస్‌ షర్మిల

హుజూర్‌నగర్‌, జూలై 4: రాష్ట్రం కోసం పోరాడిన అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్‌ మో సం చేశారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించా రు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 114వ రోజైన సోమవా రం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలంలో 13కిలోమీటర్లు నడిచారు. మండలంలోని లింగగిరి నుంచి కాచవారిగూడెం, గోపాలపు రం మీదుగా హుజూర్‌నగర్‌ పట్టణంలోని ఇందిరాసెంటర్‌, మొయిన్‌రోడ్డు, శాంతిస్తూపం వద్ద నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్‌  వరకు పాదయాత్ర నిర్వహించారు. పొట్టి శ్రీరాములు సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. నిజామాబాద్‌లో కవిత ఓడిపోతే తల్లడిల్లిన కేసీఆర్‌ ఎమ్మెల్సీ ఇచ్చారన్నారు.తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఓడిపోతుందని తెలిసి కూడా హుజూర్‌నగర్‌ టికెట్‌ ఇచ్చారన్నారు. శంకరమ్మకు ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని ప్రశ్నించారు. కన్నబిడ్డకు ఓ న్యాయం శంకరమ్మకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబంలో అందరికీ మంత్రి పదవులు ఇచ్చి అమరుల కుటుంబాలను నిర్లక్ష్యం చేశారన్నారు. 1200 మంది తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకుంటే ఏ కుటుంబానికి కేసీఆర్‌ న్యాయం చేశాడని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 108 వాహనాలు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రవేశపెట్టింది వైఎస్సే అన్నారు. సీఎం హోదాలో హుజూర్‌నగర్‌కు 33 సార్లు వైఎస్‌ పర్యటిస్తే కేసీఆర్‌ మూడు సార్లు కూడా రాలేదన్నారు. ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్‌ దొర వాగ్ధానా లు గుప్పించారు తప్ప నెరవేర్చలేదన్నారు. పాలిటెక్నికల్‌ కళాశాల ఏర్పాటుచేయలేదని, పోడు భూములకు పట్టాలు, గిరిజన రైతులకు పట్టాలు నేటికీ ఇవ్వలేదన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే సైదిరెడ్డి రేషన్‌ బియ్యం, పేకాట, గంజాయి, ఇసుక, మద్యం, భూముల మాఫియాకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. మఠంపల్లిలో 540 సర్వే నంబర్‌లో 100ఎకరాలు కబ్జా చేశాడన్నారు. సర్పంచులకు వీధిలైట్లు కూడా ఎక్కువ ధరకు కట్టబెట్టాడని, బ్లీచింగ్‌ పౌడర్‌ను సైతం వదిలిపెట్టలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్‌, బీజేపీ నాయకులు ప్లెక్సీల కోసం కొట్లాడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ ఓ సమావేశం పెడితే, కేసీఆర్‌ మరో సమావేశం పెట్టాడని, ప్రజా సమస్యలను మాత్రం గాలికి వదిలేశారన్నారు. విభజన చట్టం హామీల అమలుపై ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ ఎందుకు నిలదేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ అజెండా కోసమే రేవంత్‌రెడ్డిని కేసీఆర్‌ వాడుకుంటున్నాడని ఆరోపించారు. తెలంగాణలో ఉద్ధరించని దొర దేశాన్ని ఎలా ఉద్ధరిస్తాడని విమర్శించాడు. సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జల్లేపల్లి వెంకటేశ్వర్లు, ఏపూరి సోమన్న, నాడం శాంతకుమార్‌, నీలం రమేష్‌, రాధారెడ్డి, సత్యవతి, ఆదెర్ల శ్రీనివా్‌సరెడ్డి, పిట్టా రాంరెడ్డి, సుతారి శ్రీనివాస్‌, కామిశెట్టి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, గోపాలపురంలో షర్మిలకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Read more