కాళోజీ సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2022-09-10T05:58:26+05:30 IST

తెలుగు భాష అభివృద్ధికి కాళోజి నారాయణరావు చేసిన సేవలు మరువలేనివని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

కాళోజీ సేవలు మరువలేనివి
కాళోజీ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి

సూర్యాపేటటౌన్‌, సెప్టెంబరు 9: తెలుగు భాష అభివృద్ధికి కాళోజి నారాయణరావు చేసిన సేవలు మరువలేనివని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. శుక్రవారం కాళోజి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కాళోజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి మాట్లాడారు. తెలంగాణ యాస కోసం పరితపించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ సంస్థ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితాదేవి, నాయకులు పుట్టకిశోర్‌కుమార్‌, వై.వెంకటేశ్వర్లు, సవరాల సత్యనారాయణ పాల్గొన్నారు.

కాళోజీకి నివాళి

కలెక్టరేట్‌లో కాళోజీ చిత్రపటానికి పూల మాలలు వేసి కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌ నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా మునిసిపల్‌ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైస్‌చైర్మన్‌ పుట్ట కిషోర్‌కుమార్‌, మునిసిపల్‌ ఈఈ జీకేడి ప్రసాద్‌, డీఈ సత్యారావు, కౌన్సిలర్లు, నాయకులు, పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో కాళోజీ చిత్రపటానికి గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌ పూల మాల వేసి నివాళులర్పించారు.

Read more