కమీషన్లకోసం కాళేశ్వరం ప్రాజెక్టు

ABN , First Publish Date - 2022-06-07T06:07:38+05:30 IST

కమీషన్లు, కాంట్రాక్టుల పేరుతో కోట్ల రూపాయలు దండుకోవడంకోసం సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్‌ నాయకుడు బూడిది బిక్షమయ్యగౌడ్‌ ఆరోపించారు.

కమీషన్లకోసం కాళేశ్వరం ప్రాజెక్టు


బీజేపీ నాయకుడు బూడిది బిక్షమయ్యగౌడ్‌ 

ఆత్మకూరు(ఎం), జూన 6: కమీషన్లు, కాంట్రాక్టుల పేరుతో కోట్ల రూపాయలు దండుకోవడంకోసం సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్‌ నాయకుడు బూడిది బిక్షమయ్యగౌడ్‌ ఆరోపించారు. మండలంలోని కామునిగూడెం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కు చెందిన సుమారు 70మంది యువకులు, వార్డు సభ్యులు లోడి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బిక్షమయ్యగౌడ్‌ సమక్షంలో సోమవారం బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలకోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక్కటీ అమలు కాలేదన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి చేతగాని సీఎం కేసీఆర్‌,  కేంద్రం కొనుగోలు చేయడం లేదని తప్పుడు ప్రచారం చేశాడని అన్నారు.  ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న అభివృద్ది  సంక్షేమ పఽథకాలను చూసి అనేక మంది బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాతి బిక్షపతి, బి.అబ్బయ్య, బి.ఇంద్రారెడ్డి, జి.కాశీనాద్‌, బి.సత్యనారాయణ. ఎల్‌.వెంకటయ్య, ఎం.నరేష్‌, ఎల్‌.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Read more