ఎంజీయూలో ముగిసిన జాబ్‌మేళా

ABN , First Publish Date - 2022-02-19T06:24:38+05:30 IST

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో క్యాంపస్‌ ప్లేస్మెంట్‌ డ్రైవ్‌ శుక్రవారం ముగిసింది. ఎంజీయూ ప్రధాన క్యాంపస్‌ అన్నెపర్తిలో నిర్వహించిన జాబ్‌మేళాలో దేశంలో మొట్టమొదటి బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో ఏర్పాటైన సీ టు హెయిర్‌ కంపెనీ పాల్గొన్నది.

ఎంజీయూలో ముగిసిన జాబ్‌మేళా
జాబ్‌మేళాకు వచ్చిన అభ్యర్థులతో ఎంజీయూ అధికారులు, కంపెనీ ప్రతినిధులు

నల్లగొండ, ఫిబ్రవరి 18: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో క్యాంపస్‌ ప్లేస్మెంట్‌ డ్రైవ్‌ శుక్రవారం ముగిసింది. ఎంజీయూ ప్రధాన క్యాంపస్‌ అన్నెపర్తిలో నిర్వహించిన జాబ్‌మేళాలో దేశంలో మొట్టమొదటి బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో ఏర్పాటైన సీ టు హెయిర్‌ కంపెనీ పాల్గొన్నది. బీటెక్‌ కంప్యూటర్‌, ఎంసీఏలో 2021-22లో పాస్‌ అయిన విద్యార్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొన్నారు. మొత్తం 100 మంది విద్యార్థులు హాజరవ్వగా, వీరికి తొలుత రాత పరీక్ష నిర్వహించారు. శుక్రవారం మౌఖిక పరీక్ష నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. త్వరలో వీరికి కాల్‌ లెటర్‌ పంపిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఎంజీయూ ప్లేస్మెంట్‌ కోఆర్డినేటర్‌ బాదిని జయంతి, కంపెనీ సీఈవో రమేష్‌, పిశుపాటి, కోఫౌండర్‌ రజనీకాంత్‌, డైరెక్టర్‌ సుమిత్‌, డెవలపర్‌ శ్రీచరణ్‌ మాధవ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజర్‌ వందిత తదితరులు పాల్గొన్నారు.

Read more