కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడం ఖాయం

ABN , First Publish Date - 2022-04-05T06:51:48+05:30 IST

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌ అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావర సరుకుల ధరల పెరుగుదలకు నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యాపేటలోని ఖమ్మంక్రాస్‌ రోడ్డులో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ దిష్టి బొమ్మలను దహనం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడం ఖాయం
సూర్యాపేటలో మోదీ, కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ నిత్యావసర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన

అంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌,  ఏప్రిల్‌ 4: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌ అన్నారు.  పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావర సరుకుల ధరల పెరుగుదలకు నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యాపేటలోని ఖమ్మంక్రాస్‌ రోడ్డులో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వెంకన్నయాదవ్‌ మాటా ్లడుతూ మాయమాటలతో రెండో సారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ప్రజలపై ధరల భారాన్ని మోపారని విమర్శించారు. దీనికి నిరసనగాఈ నెల ఆరో తేదీన కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అంజద్‌అలీ, బైరు శైలేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.  ధరల పెరుగుదలపై గరేడేపల్లిలో ప్రధాన రహదారిపై కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు త్రిపురం అంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆత్మకూరు మండలం నెమ్మికల్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట మండల అధ్యక్షుడు కందాడల వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో పాండునాయక్‌, తంగెళ్ల కర్ణాకర్‌రెడ్డి పాల్గొ న్నారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్‌రావు, సాముల శివారెడ్డి, యరగాని నాగన్న, అల్లం ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లలో ప్రదర్శన నిర్వహించారు.  చింతలపాలెంలో పార్టీ మండల అధ్యక్షుడు నరాల కొండారెడ్డి ఆధర్వంలో కాంగ్రెస్‌ నాయకులు నిరసన తెలిపారు. నడిగూ డెంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గుండు శ్రీను, ఎంపీటీసీ శ్రీను ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గుర్రం నీలిమ పాల్గొన్నారు. మఠంపల్లిలో డీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఎం యాదవ్‌, కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ధీరావత్‌ నవీన్‌నాయక్‌ ఆధ్వర్యంలో మఠంపల్లి- హుజూర్‌నగర్‌ ప్రధాన రహదారిపై ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు.  పెన్‌పహాడ్‌ మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురేష్‌రావు, పాలకవీడులో పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బారావు అధ్వర్యంలో మోదీ, కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మద్దిరాలలో తుంగతుర్తి నియోజక వర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి గుడిపాటి నర్సయ్య ఆధ్వర్యంలో నిరసన తెలి పారు. కార్యక్రమంలో ముక్కాల అవిలమల్లు, పచ్చిపాల వెంకన్న పాల్గొ న్నారు. చిలుకూరులో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కీత వెంకటేశ్వర్లు, మేళ్లచెర్వులో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు శెట్టి రామచందర్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు బళ్ల బిక్షం ఆధ్వ ర్యంలో నిరసన తెలిపారు. కోదాడలోని హుజూర్‌నగర్‌లో రోడ్డులో శంకుతల థియేటర్‌ ఎదుట అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ దిష్టి బొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో చింతకుంట్ల లక్ష్మీనారా యణరెడ్డి, వంగవీటి రామారావు, వంటిపులి వెంకటేష్‌, ధనమూర్తి, చింతల పాటి శ్రీనివాస్‌  తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-04-05T06:51:48+05:30 IST