ఇది మాట నిలబెట్టుకునే ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-09-28T06:08:02+05:30 IST

ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని సూర్యాపేట జడ్పీ వైస్‌ చైర్మన్‌ వెంకట్‌నారాయణగౌడ్‌ అన్నారు. మంగళవారం నూతన ప్రతిపాదిత గట్టుప్పల మండలం ఏర్పాటుచేస్తూ తుది ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇది మాట నిలబెట్టుకునే ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుతున్న గోపగాని వెంకట్‌నారాయణగౌడ్‌

పేట జడ్పీ వైస్‌ చైర్మన్‌ వెంకట్‌నారాయణగౌడ్‌ 

గట్టుప్పల్‌ మండల ఏర్పాటుపై విజయోత్సవ ర్యాలీ


చండూరు రూరల్‌, సెప్టెంబరు 27: ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని సూర్యాపేట జడ్పీ వైస్‌ చైర్మన్‌ వెంకట్‌నారాయణగౌడ్‌ అన్నారు. మంగళవారం నూతన ప్రతిపాదిత గట్టుప్పల మండలం ఏర్పాటుచేస్తూ తుది ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గ్రామంలో మండల సాధన సమితి సభ్యులు, సర్పంచ్‌ ఇడెం రోజా ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నో ఉద్యమాల కృషి ఫలితంగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చొరవతో సీఎం కేసీఆర్‌ గట్టుప్పల మండలాన్ని ప్రకటించారని, త్వరలోనే ఇక్కడ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుచేసి పరిపాలనా సౌలభ్యాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. మండల సాధన సమితి కన్వీనర్‌ ఇడెం కైలాసం మాట్లాడుతూ గట్టుప్పల మండల ఏర్పాటుకు కృషి చేసిన సాధన సమితి సభ్యులు, ఉద్యమ నాయకులు, అమరవీరులకు, సహకరించిన మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విజయోత్సవ ర్యాలీలో డప్పుచప్పుళ్లు, కోలాటాలతో బాణసంచా కాల్చుతూ చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్‌, ఎంపీటీసీల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీ్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బండారి చంద్రయ్య, సర్పంచ్‌ ఇడెం రోజా, గొరిగె సత్తయ్య, మాజీ ఎంపీటీసీ నామని గోపాల్‌, వార్డుసభ్యులు కర్నాటి లింగయ్య, చిలుకూరి అంజయ్య, బీమగాని మహేష్‌, వెంకటేశం, మలిగ శ్రీశైలం, నర్సిరెడ్డి, రాంబాబు, మహేష్‌, అబ్బయ్య, వెంకటేశ్‌, గణేష్‌, పురుషోత్తం, రాజశేఖర్‌, స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల బీజేపీలో చేరిన ఎంపీటీసీ అవ్వారి గీతా శ్రీనివాస్‌ తిరిగి టీఆర్‌ఎ్‌సలో చేరారు.

మంత్రి జగదీష్‌రెడ్డిని కలిసిన గట్టుప్పల నాయకులు

గట్టుప్పల మండల ఏర్పాటు జీవో విడుదల కావడంతో హైదరాబాద్‌లో మంత్రి జగదీ్‌షరెడ్డిని గట్టుప్పల మండల సాధన సమితి నాయకులు, సర్పంచ్‌ ఇడెం రోజా మంగళవారం రాత్రి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండల నూతన కార్యాలయాల ప్రారంభోత్సవ తేదీపై చర్చించి అక్టోబరు 2వ తేదీని ఖరారు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అవ్వారి గీతా శ్రీనివాస్‌, నాయకులు భీమగాని మహేష్‌, మంగ వెంకటేష్‌, బండారి చంద్రయ్య, నామని గోపాల్‌, వెంకటేష్‌ గౌడ్‌, రమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more