పెంచిన బస్‌చార్జీలు తగ్గించాలి

ABN , First Publish Date - 2022-04-10T06:19:33+05:30 IST

: పెంచిన బస్సు చార్టీలను తగ్గించాలని ఈసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు విమర్శించు కుంటూ నిత్యావసరాల ధరలు పెంచి ఆర్ధిక ఇబ్బ ందులకు గురిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి, నూకల వేణుగోపాల్‌రెడ్డి, చిలుకూరి బాలు,

పెంచిన బస్‌చార్జీలు తగ్గించాలి

మిర్యాలగూడ, ఏప్రిల్‌ 9: పెంచిన బస్సు చార్టీలను తగ్గించాలని ఈసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు విమర్శించు కుంటూ నిత్యావసరాల ధరలు పెంచి ఆర్ధిక ఇబ్బ ందులకు గురిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి, నూకల వేణుగోపాల్‌రెడ్డి, చిలుకూరి బాలు, చిరుమర్తి కృష్ణయ్య, పగిడి రామ లింగయ్య, మైబెల్లి, పొదిల శ్రీనివాస్‌, అర్జున్‌ పాల్గొన్నారు. పెంచిన బస్‌ చార్జీలను తగ్గించాలని సీపీఎం ఆధ్వర్యంలో పట్ట ణంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్‌ మల్లేష్‌, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, రవినాయక్‌, బావండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, వరలక్ష్మి, ఆయూబ్‌, రాంమూర్తి పాల్గొన్నారు.

వేములపల్లి: విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్‌ఎస్‌యూఐ పనిచేస్తుం దని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ అన్నారు. మండల కేంద్రంలో ఎన్‌ఎస్‌యూఐ 52వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకుడు బొంగర్ల వినోద్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు రావు ఎల్లారెడ్డి, తమ్మడ బోయిన అర్జున్‌, శ్రీనివాస్‌, ఎంపీటీసీ పల్లా వీర య్య, వెంకటేష్‌, సత్తిరెడ్డి, గిరి, పెద వెంకన్న, వెం కన్న, రజనీకాంత్‌, నవీద్‌, హరి పాల్గొన్నారు.

నకిరేకల్‌: రైతులు కష్టపడి పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ దైద రవీందర్‌ డిమాండ్‌ చేశారు. చందుపట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం సందర్శించారు. కార్యక్రమం లో డీసీసీ ప్రధాన కార్యదర్శి యాస కర్ణాకర్‌రెడ్డి, గార్లపాటి రవీందర్‌రెడ్డి, ఇమ్మడిపాక వెంకన్న, బూతుకూరి వెంకట్‌రెడ్డి, చింతల శ్రీనివాస్‌, అబ్దుల్‌ మాజిద్‌, ఎండీ యూసుఫ్‌, నకిరేకంటి శ్రీను, వంటెపాక కిరణ్‌, దైద అఖిల్‌ పాల్గొన్నారు. 

Read more