అటవీ విస్తీర్ణం 28శాతానికి పెరుగుదల

ABN , First Publish Date - 2022-09-30T06:51:15+05:30 IST

పర్యావరణ సమతుల్యతతో పాటు వర్షపాతాన్ని పెంచేందుకు రాష్ట్రంలో 33శాతం పచ్చదనం సాధించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కె.ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

అటవీ విస్తీర్ణం 28శాతానికి పెరుగుదల
భువనగిరిలో అటవీశాఖ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి

ఇప్పటి వరకు నాటిన మొక్కలు 249 కోట్లు 

అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

డీఎ్‌ఫవో కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు

భువనగిరి టౌన్‌, సెప్టెంబరు 29: పర్యావరణ సమతుల్యతతో పాటు వర్షపాతాన్ని పెంచేందుకు రాష్ట్రంలో 33శాతం పచ్చదనం సాధించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కె.ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. భువనగిరి బైపాస్‌ రోడ్డులో 2ఎకరాల విస్తీర్ణంలో రూ.3.50కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా అటవీశాఖ కార్యాలయాన్ని విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ అడవి అంతరిస్తున్న ప్రాంతాల్లో పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్నట్టు చెప్పారు. హరితహారంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తం గా 249కోట్ల మొక్కలు నాటి 80శాతం సంరక్షించినట్టు చెప్పారు. 15వేల నర్సరీల్లో హరితహారం మొక్కలు పెంచుతున్నామన్నారు. హ రితహారం ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్రం లో అటవీ విస్తీర్ణం 24శాతం నుంచి 28శాతానికి చేరిందని, దీంతో జాతీయ అవార్డులు కూడా వస్తున్నాయన్నారు. అటవీశాతం విస్తీ ర్ణం పెంచేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తున్నారన్నారు. కా ర్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య, అటవీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శాంతికుమారి, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్‌వేటర్‌ రాఖేష్‌, మోహన్‌, డోబ్రియాల్‌, కలెక్టర్‌ పమేలా సత్పథి, అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ, యాదాద్రి సర్కిల్‌ ఫారెస్ట్‌ కన్జర్‌వేటర్‌ శివానీ డోగ్రా, జిల్లా అటవీశాఖ అధికారి ఐ.పద్మజారాణి, ఫారెస్ట్‌ రేంజర్‌ కె.కిరణ్‌కుమార్‌, డిప్యూటీ రేంజ్‌ పి.నిఖిల్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఆహ్వాన పత్రికలో ఎమ్మెల్యే పేరు మిస్‌

డీఎ్‌ఫవో కార్యాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో కేవలం ఇద్దరు మంత్రుల పేర్లను మాత్రమే ముద్రించి ఎమ్మెల్యేతోపాటు జిల్లా ప్రజాప్రతినిధుల పేర్లను విస్మరించారు. దీన్ని గమనించిన స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు పలువురు అభ్యంతరం తెలపడంతో తిరిగి ఆహ్వాన పత్రికను ముద్రించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేయగా, ఆయన్ను మంత్రులు బుజ్జగించినట్టు తెలిసింది. కాగా ఘటనపై జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణిని మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు నిలదీయగా, పొరపాటు జరిగిందని మరోమారు ఇలా జరగకుండా చూస్తామని ఆమె సమాధానమిచ్చారు.

మెరుగైన సేవలు అందించాలి

ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించాలని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ కేవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశా వర్కర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య విధానాలను కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆశాల వైద్య సేవలు మరింత మెరుగుపడాలని అన్నారు.

Read more