బీజేపీకి ఓటేస్తే మోటర్లకు మీటర్లు ఖాయం

ABN , First Publish Date - 2022-10-02T06:16:58+05:30 IST

ఉపఎన్నికలో బీజేపీకి ఓటేస్తే మోటర్లకు మీటర్లు ఖాయమని రైతుబంధు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.

బీజేపీకి ఓటేస్తే మోటర్లకు మీటర్లు ఖాయం
పలివెల గ్రామంలో రైతులతో మాట్లాడుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి

 రైతుబంధు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి 

మునుగోడు రూరల్‌, అక్టోబరు 1: ఉపఎన్నికలో బీజేపీకి ఓటేస్తే మోటర్లకు మీటర్లు ఖాయమని రైతుబంధు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పలివెల గ్రామంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు పలకరింపు’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆరేనన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్న ఘన త రాష్ర్టానికే దక్కిందన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమన్నారు. అనంతరం పలివెల, ఇప్పర్తి గ్రామాలకు చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్‌, పార్టీ మండల అధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, భవనం శ్రీనివా్‌సరెడ్డి, దాడి శ్రీనివా్‌సరెడ్డి, పలివెల ఎంపీటీసీ చెరుకు కృష్ణయ్య, పూల వెంకన్న, ఆనగంటి కృష్ణ, బొజ్జ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


మండలి చైర్మన్‌ను కలిసిన పల్లా  

చిట్యాలరూరల్‌: రైతుబంధు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి చిట్యాల మండలం ఉరుమడ్లలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఉరుమడ్లలోని తన నివాసానికి మొదటిసారిగా రాజేశ్వర్‌రెడ్డి రావడంతో చైర్మన్‌ ఆయనకు స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు.  


టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతల రహస్య సమావేశం

నాయకులను బుజ్జగించిన కూసుకుంట్ల

మునుగోడు/మర్రిగూడ, అక్టోబరు 1: మునుగోడు నియోజకవర్గ పరిధిలోని టీఆర్‌ఎ్‌సకు చెందిన పలువురు అసమ్మతి నేతలు హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం సమావేశమైనట్లు సమాచారం. మర్రిగూడ మండలానికి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌నేత మునగాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అసమ్మతి నేతలు పార్టీలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. విజయదశమి తర్వాత తమ భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వెంటనే అక్కడకు చేరుకున్నారు. నేరుగా ఆయన వారందరితో కలిసి మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అధిష్ఠానం సూచన మేరకు అందరం కలిసి పనిచేద్దామని చెప్పారు. 

Updated Date - 2022-10-02T06:16:58+05:30 IST