ధర్మం వైపు నిలిచి గెలిపిస్తే కేంద్రం నిధులతో అభివృద్ధిచేస్తా

ABN , First Publish Date - 2022-10-14T05:53:51+05:30 IST

మునుగోడులో జరిగే యుద్ధంలో ప్రజలు ధర్మంవైపు నిలిచి తనను ఆశీర్వదిస్తే కేంద్ర ప్రభుత్వ సహాయంతో ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ధర్మం వైపు నిలిచి గెలిపిస్తే కేంద్రం నిధులతో అభివృద్ధిచేస్తా
ప్రచారంలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు రూరల్‌, అక్టోబరు 13: మునుగోడులో జరిగే యుద్ధంలో ప్రజలు ధర్మంవైపు నిలిచి తనను ఆశీర్వదిస్తే కేంద్ర ప్రభుత్వ సహాయంతో ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కల్వలపల్లి, పులిపలుపుల, జమస్థాన్‌పల్లి, గుండ్లూరిగూడెం, గూడపూర్‌, కొరటికల్‌ తదితర గ్రామాల్లో గురువారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా గెలుపొంది మూడున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికోసం వందలసార్లు అపాయింట్‌మెంట్‌ అడిగినా ఇవ్వని ముఖ్యమంత్రి, మంత్రులకు తన రాజీనామాతో ఓటమి భయం పట్టుకుందన్నారు. మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేస్తున్నారని తెలిపారు. తనను ఓడించేందుకు 86 మంది కేసీఆర్‌ బానిసలు మునుగోడులో తిరుగుతున్నారని, ఆ బానిసలు చెప్పిన మాటలు మునుగోడు ప్రజలు పట్టించుకోరన్నారు. 90శాతం పనులైన ఉదయం సముద్రాన్ని పూర్తిచేయని మంత్రి జగదీ్‌షరెడ్డి ఓట్ల కోసం మునుగోడులో ఎలా తిరుగుతున్నాడని ప్రశ్నించారు. ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎక్కడ ఉంటాడో ఎవ్వరికీ తెలియదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ చాడ సురే్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి దర్శనం వేణుకుమార్‌, డీసీసీబీ డైరెక్టర్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి, బీజేపీ నాయకులు బూడిద లింగయ్య యాదవ్‌, ధనుంజయ పాల్గొన్నారు. 


పేదలకు చేసిన సేవలే రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తాయి

చౌటుప్పల్‌ రూరల్‌: పేదలకు చేసిన సేవలే రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తాయని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి అన్నారు. గురువారం మండలకేంద్రంలో ఇంటింటి ప్రచారంలో ఆమె మట్లాడుతూ కేసీఆర్‌ నియంత, అవినీతి పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు ప్రజలు అండగా నిలుస్తున్నారని చెప్పారు.   

Updated Date - 2022-10-14T05:53:51+05:30 IST