జైలుకెళ్లినా దొంగ బుద్ధి మారలే..

ABN , First Publish Date - 2022-01-23T06:01:55+05:30 IST

: పలుమార్లు జైలు వెళ్లి వచ్చినా అతని బుద్ధి మారలేదు. 13చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. విడుదలైనా మళ్లీ వా హనాల దొంగతనాలనే అలవాటుగా మార్చుకున్నాడు. వాహనాల దొంగత నాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని భువన

జైలుకెళ్లినా దొంగ బుద్ధి మారలే..
కేసు వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ నారాయణరెడ్డి

13 చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించినా మారని తీరు

మళ్లీ కటకటాల వెనక్కి పంపిన భువనగిరి పోలీసులు

భువనగిరి టౌన్‌, జనవరి 22: పలుమార్లు జైలు వెళ్లి వచ్చినా అతని బుద్ధి మారలేదు. 13చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. విడుదలైనా మళ్లీ వా హనాల దొంగతనాలనే అలవాటుగా మార్చుకున్నాడు. వాహనాల దొంగత నాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని భువనగిరి పోలీసులు అరెస్టు చేసి మళ్లీ కటకటలా వెనెక్కి పంపారు. భువనగిరిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ కె. నారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు. భువనగిరిలోని డాల్ఫిన్‌ హోటల్‌ వద్ద జిల్లా సీసీఎస్‌ పోలీసులు, పట్టణ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మం డలంలోని అన్నోజిగూడ వికలాంగుల కాలనీకి చెందిన ఘనపురం నిఖిల్‌ అనుమానాస్పదంగా కన్పించాడు. అతనిని అదుపులోకి తీసుకొని విచారిం చారు. దీంతో నేరాల చిట్టా వెలుగు చూసింది. భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల రెండు బైక్‌లు, భువనగిరి రూరల్‌, యాదగిరిగుట్ట, బీబీనగర్‌, ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆరు బైక్‌లను చోరీ చేసి తప్పించుకొని తిరుగుతున్నారు. పలు పోలీస్‌స్టేషన్లలో అతనిపై బైక్‌ దొంగతనం కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే 2013 నుంచి 2020 వరకు యా దాద్రి, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడిన అతను 13 పర్యాయాలు  జైలు శిక్ష కూడా అనుభవించి  2021 డిసెంబరు 2వ తేదీన జైలు నుంచి విడుదలై తిరిగి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అలాగే కాజీపేట రైల్వే పోలీసులు 2013లో అతనిపై సస్పెక్ట్‌ షీట్‌ కూడా తెరిచారు. అతని నుంచి మూడు బైక్‌లు, మూడు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకొని శనివారం భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఆదే శాల మేరకు 14రోజుల రిమాండ్‌కు భువనగిరి సబ్‌జైలుకు తరలించారు. నేర చరిత్ర ఉన్న నిఖిల్‌ను పట్టుకున్న సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శివశంకర్‌గౌడ్‌, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ఏ. సుధాకర్‌ను డీసీపీ అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ వెంకట్‌రెడ్డి, పోలీస్‌ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. 

Read more