భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు

ABN , First Publish Date - 2022-10-04T05:41:27+05:30 IST

భక్తి శ్రద్ధలతో దేవతామూర్తులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని సిద్ధగురు రమణానంద మహర్షి అన్నారు.

భక్తితో ఆరాధిస్తే సకల శుభాలుభువనగిరి రూరల్‌, అక్టోబరు3: భక్తి శ్రద్ధలతో దేవతామూర్తులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని సిద్ధగురు రమణానంద మహర్షి అన్నారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి రమణేశ్వరం శివశక్తి శిర్డీసాయి అనుగ్రహ పీఠంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం 1504 సహస్ర శివలింగాలు, రుషిలింగాలు, దుర్గామాతను శోభాయమానంగా అలంకరించి వివిధ ద్రవ్యాలతో అభిషేకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు ఆధ్యాత్మికతను పెంపొందించుకున్నట్లయితే మానసిక ఉల్లాసంతో పాటు సంపూర్ణఆరోగ్యంగా జీవించవచ్చునన్నారు. అనంతరం మహాగౌరి దేవి అవతార విశేషాలను మహిళలపై మహర్షి ప్రవచనం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. 


Read more