భార్యను చంపిన భర్త, అత్తకు జీవిత ఖైదు

ABN , First Publish Date - 2022-12-12T23:41:49+05:30 IST

అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్త, ఆమె అత్తకు జీవిత ఖైదు విధిస్తూ ప్రిన్సిపల్‌ జిల్లా సెషన్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్‌ సోమవారం తీర్పు ఇచ్చారు

భార్యను చంపిన భర్త, అత్తకు జీవిత ఖైదు

భువనగిరి రూరల్‌, డిసెంబరు 12: అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్త, ఆమె అత్తకు జీవిత ఖైదు విధిస్తూ ప్రిన్సిపల్‌ జిల్లా సెషన్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్‌ సోమవారం తీర్పు ఇచ్చారు. భువనగిరి రూరల్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం చోల్లేరు గ్రామానికి చెందిన స్వప్నకు 2011న మ ండలంలోని బస్వాపూర్‌ గ్రామానికి చెందిన మచ్చ విఘ్నేశ్‌తో వివాహ మైం ది. వివాహ సమయంలో రూ.1.15లక్షలు, ఐదు తులాల బంగారు ఆభర ణాలు, బైక్‌, గృహోపకరణాలు ఇచ్చారు. నాలుగు సంవత్సరాలు సాఫీగా సాగిన సంసారంలో ఇద్దరు కుమార్తెలు జన్మించారు. కాగా అదనపు కట్నం కోసం విఘ్నేష్‌, అతని తల్లి పద్మ స్వప్నను తరుచూ వేధించేవారు. 2015 సవంబరు 18వ తేదీన భర్త విఘ్నేష్‌, అత్త పద్మ బలవంతంగా స్వప్నపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన స్వప్న 2015 నవం బరు 23వ తేదీన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. స్వప్న సోదరుడు ఏదులకంటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు అప్పటి పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

Updated Date - 2022-12-12T23:41:53+05:30 IST