ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు

ABN , First Publish Date - 2022-02-16T06:41:26+05:30 IST

ఆయిల్‌పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర అయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు.

ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న చైర్మన్‌ రామకృష్ణారెడ్డి

ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి


సంస్థాన్‌ నారాయణపురం, ఫిబ్రవరి 15: ఆయిల్‌పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర అయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌, సింగిల్‌విండో సంయుక్త ఆధ్వర్యంలో మండలంలోని గంగమూలతండాలో ఆయిల్‌పాం సాగుపై రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్‌పాం సాగులో ఎకరాకు 57 మొక్కలు నాటాలన్నారు. ఒక్కో మొక్కకు రైతులు రూ.35 చెల్లిస్తే మిగితా 60శాతం సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 70శాతం వంటనూనెను దిగుమతి చేసుకుంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో మనమే ఆయిల్‌ఫాం సాగు చేయాలని సూ చించారు. ఆయిల్‌ఫాంకు భవిష్యత్‌లో మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవిప్రేమ్‌చందర్‌రెడ్డి, జడ్పీటీసీ వీరమళ్ళ భానుమతివెంకటేశంగౌడ్‌,  చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌లు జక్కిడి జంగారెడ్డి, చింతల దామోధర్‌రెడ్డి, గుత్తా ప్రేమ్‌చందర్‌రెడ్డి, వీరమళ్ళ వెంకటేశంగౌడ్‌, సర్పంచ్‌లు కొర్ర సుని త, కురిమిద్దె కళమ్మ, సుర్వి యాదయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.


గెలుపు, ఓటములను సమానంగా భావించాలి 

చౌటుప్పల్‌ టౌన్‌: క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా భావించాలని ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. భగత్‌సింగ్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని లక్కారంలో నిర్వహించిన వాలీబాల్‌ టోర్నమెంట్‌ విజేతలకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంగళవారం బహుమతులు అందజే శారు. క్రీడల నిర్వహణతో ప్రాంతాల మధ్య స్నేహభావం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ బొడ్డు శ్రీనివా్‌సరెడ్డి, డైరెక్టర్‌ సుర్కంటి నవీన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌నాయకులు ప్రభాకర్‌రెడ్డి, నిరంజన్‌గౌడ్‌, వెంకటేశ్‌యాదవ్‌, మాజీ సర్పంచ్‌లు పాశం సంజయ్‌ బాబు, కానుగు బాలరాజు, బీమిడి రాంరెడ్డి, మోహన్‌రెడ్డి, ప్రవీన్‌ పాల్గొన్నారు.


Read more