ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక లాభాలు

ABN , First Publish Date - 2022-09-19T06:14:06+05:30 IST

ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులు అధిక లాభాలు సాధించవచ్చని ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలో ని రెడ్లరేపాక పరిధిలోని మర్లపాడులో కొమిరెల్లి కృష్ణారెడ్డి వ్యవసాయ భూమిలో ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటారు.

ఆయిల్‌పామ్‌ సాగుతో  అధిక లాభాలు
మర్లపాడులో ఆయిల్‌పామ్‌ మొక్క నాటుతున్న కంచర్ల రామకృష్ణారెడ్డి

వలిగొండ, సెప్టెంబరు 18: ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులు అధిక లాభాలు సాధించవచ్చని ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలో ని రెడ్లరేపాక పరిధిలోని మర్లపాడులో కొమిరెల్లి కృష్ణారెడ్డి వ్యవసాయ భూమిలో ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలవల్ల ఆయిల్‌పామ్‌ పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లదని చెప్పారు. వలిగొండ మండల వ్యాప్తంగా 70 మంది రైతులు సుమారు 300 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేసేందుకు ముందుకొచ్చారని చెప్పారు. 25వేల ఎకరాల్లో స్థానికంగా సాగు చేస్తే ఈ ప్రాంతంలోనే ఫ్యాక్టరీ ఏర్పాటుకోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 60లక్షల ఎకరాల్లో మొక్కలు నాటే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆయిల్‌పామ్‌ ఎకరాకు రూ.10లక్షల దిగుబడి వస్తుందని, ఇందుకు రైతుకు సుమారు రూ.లక్షా 50వేల లాభం వస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించే సబ్సిడీని ఆయిల్‌పామ్‌ రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమే్‌షరాజు, పీఏసీఎస్‌ చైర్మన్‌ తుమ్మల వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ నోముల మల్లేష్‌, నాయకులు లక్ష్మారెడ్డి, రత్నయ్య, సత్తిరెడ్డి, లింగస్వామి, భిక్షపతి, నరేష్‌, శ్రీను, అశ్విన్‌, తదితరులు పాల్గొన్నారు. 

Read more