మ్యానపవర్‌ ఏజెన్సీని రద్దు చేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2022-07-18T06:06:41+05:30 IST

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ని బంధనలకు విరుద్ధంగా ఎంపిక చేసిన మ్యానపవర్‌ ఏజెన్సీని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

మ్యానపవర్‌ ఏజెన్సీని రద్దు చేసిన హైకోర్టు

 వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ  

నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక చేయడమే కారణం 

నల్లగొండ అర్బన, జూలై 17: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ని బంధనలకు విరుద్ధంగా ఎంపిక చేసిన మ్యానపవర్‌ ఏజెన్సీని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి టెండర్లు పిలవకుండా, సీనియారిటీ లేకుండా ఒకే ఏజెన్సీకి 96 పోస్టులు కట్టబెట్టడాన్ని సవాల్‌ చేస్తూ ఎంప్యానల్‌లోని కొన్ని అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ నిర్వాహకులు కోర్టుకు వెళ్లారు. క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు సదరు ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక చేసినట్లు గుర్తించి శ్రీరా మ అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీని రద్దు చేస్తూ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా కొత్త ఏజెన్సీని ఎంపిక చే సే వరకు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీని కొనసాగించాలని, తక్షణమే ని బంధనలకు అనుగుణంగా కొత్త ఏజెన్సీని ఎంపిక చేయాలని సం బంధిత అధికారులను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే... జిల్లా వై ద్య, ఆరోగ్యశాఖలో 96 ఏఎనఎంల పోస్టుల భర్తీకి గతేడాది జూన నెలలో నోటిఫికేషన జారీ చేశారు. వారి ఎంపిక ప్రక్రియ మొత్తం క లెక్టర్‌, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఎంపిక చేసిన ఆర్డ ర్‌ ప్రకారం పీహెచసీలకు కేటాయించారు. అనంతరం ఏఎనఎంలను శ్రీరామ ఏజెన్సీకి అప్పజెప్పారు. ప్రస్తుతం వారికి కేటాయించిన పీహెచసీల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే సదరు అవుట్‌ సో ర్సింగ్‌ ఏజెన్సీకి ఎలాంటి సీనియారిటీ లేదని టెండర్లు పిలవకుం డాఅధికారులు ఒకే ఏజెన్సీకి అన్ని పోస్టులు ఎలా కేటాయిస్తారని సవాల్‌ చేస్తూ కొందరు ఏజెన్సీ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించా రు. జిల్లాలో ఎంప్లాయిమెంట్‌లో కూడా సదరు ఏజెన్సీకి ఎంప్యానల్‌ సభ్యత్వం లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి నిబంధనలకు విరుద్ధంగా శ్రీరామ ఏజెన్సీని ఎంపిక చేసి పో స్టులు కట్టబెట్టారని సవాల్‌ చేస్తూ ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించారు. పరిశీలించిన కోర్టు ఏజెన్సీ ఎంపిక చెల్లదని తాజాగా ఉ త్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు జిల్లా వైద్యఆరోగ్య శాఖకు అందాయి. ఏజెన్సీ ఎంపిక విషయంలోనే వైద్య ఆరోగ్యశాఖ అధికారుల తీరుపై గతంలోనే పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఎ లాంటి సీనియారిటీ లేని కొత్త ఏజెన్సీకి పోస్టులన్నీ కట్టబెట్టడం వెనుక పెద్ద చేతులు మారినట్లు ఎంప్యానల్‌ ఏజెన్సీల నిర్వాహకులు ఆరోపణలు చేశారు. ఏది ఏమైనప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక చేయడం సరైన పద్ధతి కాదని, కోర్టు తీసుకున్న ని ర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రద్దు చేసిన వి షయాన్ని డీఎంహెచవో కార్యాలయ ఉద్యోగి నిర్థారించారు. Read more