నిమజ్జనానికి భారీగా వినాయకులు

ABN , First Publish Date - 2022-09-12T05:23:16+05:30 IST

గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలను కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు భారీగా తరలివచ్చారు.

నిమజ్జనానికి భారీగా వినాయకులు
చౌటపల్లిలో గణేష్‌ శోభాయాత్రలో పాల్గొన్న స్థానికులు

కృష్ణానదిలో సందడిగా నిమజ్జనోత్సవం

మఠంపల్లి, సెప్టెంబరు 11: గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలను కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు భారీగా తరలివచ్చారు. జిల్లా నలుమూలలనుం చి అధిక సంఖ్యలో విగ్రహాలను మట్టపల్లికి తీసుకురావడంతో కృష్ణాతీరం సందడిగా మారింది. గణపతి బప్పా మోరియా.. జైబో లో గణేశ్‌ మహరాజ్‌కి జై అంటూ యువకుల నినాదాలు మార్మోగాయి. మఠంపల్లి, పెదవీడు, చౌటపల్లి, బక్కమంతులగూడెం, భీల్యానాయక్‌తండా, వర్ధాపురం తదితర గ్రామాల్లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించి కోలాట ప్రదర్శనలు, అన్నదా నం చేశారు. నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పా టు చేసినట్లు తహసీల్దార్‌ సాయిగౌడ్‌, ఎంపీడీవో జానకిరాములు, ఎస్‌ఐ రవి, సర్పంచ్‌ దాసరి విజయలక్ష్మి, చంద్రశేఖర్‌ తెలిపారు. 

Read more