5 క్వింటాళ్ల పీడిఎస్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-09-19T06:38:52+05:30 IST

మండలంలోని అమీనాబాద్‌లో ఐదు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

5 క్వింటాళ్ల పీడిఎస్‌ బియ్యం పట్టివేత

అనంతగిరి, సెప్టెంబరు 18:  మండలంలోని అమీనాబాద్‌లో ఐదు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ సత్యనారాయణ  తెలిపిన వివరాల ప్రకారం.. అమీనాబాద్‌ గ్రామంలోని రేపాల వెంకటేశ్వరరావు ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎనిమిది బస్తాల్లో నిల్వ  ఉంచిన ఐదు క్వింటాళ్ల పీడీఎస్‌  బియ్యాన్ని పట్టుకు న్నట్లు తెలిపారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు తెలిపారు. Read more