రూ.లక్ష విలువైన గుట్కాలు స్వాధీనం

ABN , First Publish Date - 2022-08-17T06:20:13+05:30 IST

మండలంలోని రామాపురం గ్రామంలో నలుగురు వ్యక్తుల నుంచి సుమారు రూ.లక్ష విలువ చేసే గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.లక్ష విలువైన గుట్కాలు స్వాధీనం

మేళ్లచెర్వు, ఆగస్టు 16: మండలంలోని రామాపురం గ్రామంలో నలుగురు వ్యక్తుల నుంచి సుమారు రూ.లక్ష విలువ చేసే గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏఎ్‌సఐ ఆనంద్‌నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రామాపురం గ్రామానికి చెందిన చింత్రియాల రామాంజనేయులు దుకాణంలో రూ.25 వేలు, గోళ్ల గోపి దుకాణంలో రూ.27వేలు, కంచి దుర్గాప్రసాద్‌ దుకాణంలో రూ.10వేల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు.  అదేవిధంగా మంగళికుంటాతండాకు చెందిన భూక్య మోతీలాల్‌ ఇంటిలో నిల్వ చేసిన రూ.46వేల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. రామాంజనేయులు, గోళ్ళ గోపి, మోతీలాల్‌ను అరెస్టు చేశారు. దుర్గాప్రసాద్‌ పరారీలో ఉన్నాడు. రామాంజనేయులు, గోళ్ళ గోపిలు యర్రవరం గ్రామానికి చెందిన షేక్‌ నాగుల్‌మీరా వద్ద నుంచి గుట్కాలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. 


Read more