గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-10T06:43:30+05:30 IST

పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకులాలను సద్వినియోగం చేసుకోవా లని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.

గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

మునగాల రూరల్‌, సెప్టెంబరు 9: పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకులాలను సద్వినియోగం చేసుకోవా లని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. ‘స్వచ్ఛ గురు కుల్‌’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని ఆకు పాముల గిరిజన డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటి మాట్లాడారు. గురుకుల పాఠశాలల్లో  ప్రతీ విద్యార్థికి సంవత్సరానికి రూ.1.20 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. అక్టోబరు నెలలో రాష్ట్రంలో మరో 33 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శ్రీలత, ఎంపీపీ చింతా కవితారెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పైడిమర్రి సత్యబాబు, కౌన్సిలర్‌ పద్మజ, గ్రంథాలయ చైర్మన్‌ రహీం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-10T06:43:30+05:30 IST