గురుకులాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , First Publish Date - 2022-09-11T06:15:38+05:30 IST

స్వచ్ఛ గురుకుల వారోత్సవా ల్లో భాగంగా అన్ని గురుకులాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే భాస్కర్‌రావు అన్నారు.

గురుకులాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
గురుకుల ఆవరణలో మొక్క నాటుతున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు

మిర్యాలగూడ రూర ల్‌, సెప్టెంబరు 10:  స్వచ్ఛ గురుకుల వారోత్సవా ల్లో భాగంగా అన్ని గురుకులాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే  భాస్కర్‌రావు అన్నారు. శ నివారం స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో భాగంగా మండలంలోని అవంతీపురం గురుకుల ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించి మాట్లాడారు.  ప్రభుత్వం గురు పూజోత్సవం సందర్భంగా సెప్టెంబరు 5 నుంచి 11వ తేదీ వరకు స్వచ్ఛ గురుకుల కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గురుకుల పా ఠశాల ఆవరణలో చెత్తను తొలగించాలని, తరగతి గదులను శుభ్రం చేసుకోవాల ని, కిచెన గదిని, సామగ్రిని శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది సౌకర్యాలు పెంచాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ సుధాకర్‌, ఎంఈవో బాలాజీనాయక్‌, సహకార బ్యాంక్‌ చైర్మన రామకృష్ణ, నాగ య్య, అజయ్‌కుమార్‌, నూరుద్దిన, సక్రు తదితరులు పాల్గొన్నారు.


Read more