గ్రూప్‌-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-10-11T06:15:02+05:30 IST

జిల్లాలో గ్రూప్‌-1 పరీక్షల ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నా రు.

గ్రూప్‌-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), అక్టోబరు 10 : జిల్లాలో గ్రూప్‌-1 పరీక్షల ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నా రు. త్వరలో జిల్లాలో నిర్వహించబో యే గ్రూప్‌-1 పరీక్షల ఏర్పాట్లపై వివిధశాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న జిల్లాలోని 31 పరీక్షాకేంద్రాల్లో గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహిస్తారని, పరీక్షకు 9,181 మంది హాజరుకాన్నుట్లు తెలిపారు.పరీక్ష లు ప్రశాంతంగా, సజావుగా జరిగే లా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పరీ క్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, తాగునీరు, వైద్య శిబిరా లు, మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటుచేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ర్టానిక్‌ పరికరాలు అనుమతించవద్దన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి గం టన్నర ముందుగా చేరుకోవాలన్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదన పు కలెక్టర్‌ మోహన్‌రావు, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, డీఎస్పీ పరిక నాగభూషణం, డీఈవో అశోక్‌, ఏవో శ్రీదేవి ఉన్నారు.

ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలి

ప్రజల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన దరఖాస్తులు స్వీకరించి, మాట్లాడారు. భూసమస్యలకు సం బంధించి రైతులు మీసేవా కేంద్రాల్లో సరైన పద్ధతిలో న మోదు చేసుకోవాలన్నారు. మొత్తం 49 దరఖాస్తులు అం దాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

బాలపురస్కార్‌ అవార్డులకు దరఖాస్తులు

జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన బాలబాలికలకు 2022 సంవత్సరానికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కా ర్‌ అవార్డులకు ఈ నెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖా స్తు చేసుకోవాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డులకు రూ.లక్ష నగదుతో పాటు మెడల్‌, సర్టిఫికెట్లు అందజేస్తారన్నారు. అవార్డుకు ఐదేళ్ల వయస్సు నుంచి 18 ఏళ్ల వారు అర్హులన్నారు. ఇన్నోవేషన్‌, సోషల్‌సర్వీస్‌, ధైర్యసాహసాలు, పాండిత్యం, క్రీడలు, కళ లు, సాంస్కృతిక కళల్లో ప్రావీణ్యం ఉండాలన్నారు. 

ఈడబ్లూఎస్‌ రిజర్వేషన్‌పై వినతి

ఈడబ్లూఎస్‌ రిజర్వేషన్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో  కల్పించాలని రెడ్డి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్ల ఉప్పల్‌రెడ్డి కోరా రు. కలెక్టర్‌కు కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. రెడ్డిల అబివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నా రు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సురకంటి న ర్సిరెడ్డి, కొల్లు వెంకట్‌రెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెలుగు మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Read more