పచ్చదనమే మనకు సరిహద్దు

ABN , First Publish Date - 2022-06-07T06:35:41+05:30 IST

పచ్చదనంలో మనకంటే పక్క రాష్ట్రం ఎంతో వెనుకబడిందని, హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై ప్రయాణిస్తుంటే పచ్చ టి మొక్కలు, చెట్ట వరుసతో కూడిన ఆహ్లాదం ముగిసిందంటే తెలంగాణ సరిహద్దు దాటామని అర్థమవుతుందని రాష్ట్ర మునిసిపల్‌ పరిపాలనా విభాగం సంచాలకులు (సీడీఎంఏ) డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు.

పచ్చదనమే మనకు సరిహద్దు
భువనగిరి పట్టణ ప్రగతిలో మాట్లాడుతున్న సీడీఎంఏ డాక్టర్‌ సత్యనారాయణ

హైదరాబాద్‌-విజయవాడ హైవే రుజువు

రెండేళ్లలో 144 మునిసిపాలిటీలలో రూ.7వేల కోట్ల పనులు 

పట్టణ ప్రగతిలో సీడీఎంఏ డాక్టర్‌ సత్యనారాయణ 


భువనగిరి టౌన్‌, జూన్‌ 6 :  పచ్చదనంలో మనకంటే పక్క రాష్ట్రం ఎంతో వెనుకబడిందని, హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై ప్రయాణిస్తుంటే పచ్చ టి మొక్కలు, చెట్ట వరుసతో కూడిన ఆహ్లాదం ముగిసిందంటే తెలంగాణ సరిహద్దు దాటామని అర్థమవుతుందని రాష్ట్ర మునిసిపల్‌ పరిపాలనా విభాగం సంచాలకులు (సీడీఎంఏ) డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా భువనగిరి మునిసిపాలిటీ 11వ వార్డు పరిధిలోని బొమ్మాయిపల్లిలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. పరిశుభ్రత, హరిత పట్టణాలు సీఎం కేసీఆర్‌ స్వప్నమన్నారు. రెండేళ్ల నుంచి సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని 144 మునిసిపాలిటీలకు ప్రతి ఏటా రూ.3,675కోట్లు మంజూరు చేస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్సార్‌ హయాంలో 3 దఫాలుగా 4,448 పోస్టులను భర్తీ చేయగా సీఎం కేసీఆర్‌ ఒకేసారి 4500 పో స్టుల భర్తీకి ఇటీవలె నోటీఫికేషన్‌ జారీ చేశారని అన్నారు. రూ.500కోట్లతో అన్ని పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లను ప్రభుత్వం నిర్మిస్తున్నదని అన్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో పనుల కోసం ప్రజలు కార్యాలయాలు, ప్రజా ప్రతినిధుల వద్దకు తిరిగేవారని కానీ పట్టణ, పల్లె ప్రగతితో ఆ పరిస్థితులు మారాయన్నారు. భువనగిరి పట్టణంలో కోట్లాది  రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. కలెక్టర్‌ పమేలా సత్పథి మాట్లాడుతూ ఆన్‌లైన్‌ ట్రేడ్‌ లైసెన్స్‌ జారీలో జిల్లా అగ్రస్థానంలో నిలువడం అభినందనీయమన్నారు. పట్టణ ప్రగతిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన అంజనేయులు, ఆర్‌డీఎంఏ శ్రీధర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య, కౌన్సిలర్లు జిట్ట వేణుగోపాల్‌రెడ్డి, పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, కమిషనర్‌ నాగిరెడ్డి పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలోని సమస్యలను పరిష్కరించాలని సీడీఎంఏ సంచాలకులు సత్యనారాయణకు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, కౌన్సిలర్లు పడిగెల రేణుకా ప్రదీప్‌, ఈరపాక నర్సింహ, కౌరంకొండ వెంకటేష్‌, పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-07T06:35:41+05:30 IST