గొప్ప దేశభక్తుడు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ: బీజేపీ

ABN , First Publish Date - 2022-07-07T06:37:27+05:30 IST

దేశ సమైక్యత కోసం ప్రాణాల ర్పించిన గొప్ప దేశభక్తుడు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్‌ అన్నారు.

గొప్ప దేశభక్తుడు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ: బీజేపీ

కోదాడ టౌన్‌, హుజూర్‌నగర్‌, జూన్‌ 6:  దేశ సమైక్యత కోసం  ప్రాణాల ర్పించిన గొప్ప దేశభక్తుడు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్‌ అన్నారు. జన సంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కోదాడ, హుజూర్‌నగర్‌ పట్టణాల్లోని బీజేపీ కార్యాలయాల్లో శ్యామ్‌ప్రసాద్‌ ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యశ్వంత్‌ మాట్లాడుతూ ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి బొలిశెట్టి కృష్ణయ్య, యాదా రమేష్‌,  సాతులూరి హను మంతరావు, నకిరేకంటి జగన్మోహన్‌రావు, వెంకటకృష్ణ, బుజ్జి వెంకటేష్‌, నరేష్‌, ఏపూరి గణేష్‌, పురుష్తోతం, రమేష్‌  వేముల శేఖర్‌రెడ్డి, రామరాజు, ఉమామహేశ్వరరావు, వెంకటేశ్వర్లు, శ్రీను, శంభిరెడ్డి, రాహుల్‌, చారి పాల్గొన్నారు.


Read more