పీహెచసీల అభివృద్ధికి నిధుల మంజూరు

ABN , First Publish Date - 2022-09-13T05:46:32+05:30 IST

జిల్లాలోని 24గంటల పీ హెచసీల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు మంజూరైనట్లు జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి తెలిపారు.

పీహెచసీల అభివృద్ధికి నిధుల మంజూరు
చండూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన నరేందర్‌రెడ్డి

 జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి 

చండూరు, సెప్టెంబరు 12: జిల్లాలోని 24గంటల పీ హెచసీల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు మంజూరైనట్లు జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం చండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గానికి ఒక పీహెచసీ ఎంపిక చేసినట్లు తెలిపారు. చండూరు పీహెచసీకి రూ.68 లక్షలు, పీఏపల్లి రూ. 64లక్షలు, నార్కట్‌పల్లి రూ.56లక్షలు, మునుగోడు రూ.66లక్షలు, నల్లగొండ అర్బన రూ.33 లక్షల చొప్పున కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ము నుగోడు, చండూరు పీహెచసీలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అంతేకాక జిల్లాలో శిథిలావస్థలో ఉన్న పీహెచసీ భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మించటానికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. చండూరు జడ్పీటీసి కర్నాటి వెంకటేశం మాట్లాడుతూ ఎంపీడీవో కార్యాలయం మరమ్మతులకు రూ.20లక్షలు, అసంపూర్తిగా ఉన్న స్త్రీశక్తి భవనం పూర్తి చేసేం దుకు రూ.10లక్షలు ఎస్‌డీఎఫ్‌ నిధులు త్వరలోనే మంజూరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన గుర్రం మాధవివెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, మునిసిపల్‌ కౌన్సిలర్‌ కోడి వెంకన్న, బొడ్డు సతీష్‌, గిరి లింగస్వామి పాల్గొన్నారు.

ఉప ఎన్నికలో టీఆర్‌ఎ్‌స గెలుపు ఖాయం  

మర్రిగూడ: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని, 

భాగంగా టీఆర్‌ఎ్‌సకే అనుకూలంగా పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని  జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ పార్టీ మూడో స్థానంలో ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు చేసిన పలు సర్వేల్లో ఎక్కువ శాతం టీఆర్‌ఎ్‌సకే ప్రజలు, ఓటర్లు మొగ్గుచూపుతున్నార ని పేర్కొన్నారు. అనంతరం మునుగోడు ఉప ఎన్నికపై ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులతో టీఆర్‌ఎస్‌ పార్టీ అంతర్గత వ్యవహారాలపై సమీక్షించారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరే విధంగా చూడాలని, ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. 


Read more