ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-18T06:20:44+05:30 IST

రైతులు కొనుగో లు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం కొ నుగోళ్లు వేగవంతం చే యాలని డీఆర్‌డీవో పీడీ కాళిందిని అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కాళిందిని

డీఆర్‌డీవో పీడీ కాళిందిని

చండూరు,చండూరురూరల్‌,  మే 17: రైతులు కొనుగో లు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం కొ నుగోళ్లు వేగవంతం చే యాలని డీఆర్‌డీవో పీడీ కాళిందిని అధికారులను ఆదేశించారు. మంగళవారం చండూ రు మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో పాటు మండల పరిధిలోని గుండ్రపల్లి, బోడంగిపర్తి, పుల్లెంల గ్రామాల్లో కొనుగో లు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కొ నుగోళ్లు వేగవంతం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. లారీల కొరత ఉండటంతో ధాన్యం పోసిన రైతులు మూడు, నాలుగు వా రాల పాటు పడిగాపులు కాస్తున్నారని మార్కెట్‌ కార్యదర్శి ఆమె దృష్టికి తేవడం తో, వెంటనే లారీ యాజమానులతో మాట్లాడి ఐదు లారీలను ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆమె వెంట డీఎ్‌సవో వెంకటేశ్వర్లు, సివిల్‌ సప్లై అధికారి విజయ, మార్కెట్‌ కార్యదర్శి రవి, దేవదాస్‌, పుల్లయ్య ఉన్నారు.


Read more