ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-12-02T02:18:16+05:30 IST

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బారీ అశోక్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీకళాశాల ఆవరణలో మానవహారం నిర్వహించి మాట్లాడారు.

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి

సూర్యాపేట అర్బన్‌, డిసెంబరు 1: జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బారీ అశోక్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీకళాశాల ఆవరణలో మానవహారం నిర్వహించి మాట్లాడారు. పట్టణంలో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థినులు డిగ్రీలో చేరాలంటే ప్రైవేట్‌ కళాశాలను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. దీంతో ప్రైవేట్‌ కళాశాలల్లో ఫీజులు చెల్లించలేక విద్యార్థినులు చదువును అంతటితో ఆపేస్తున్నారన్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి చొరవ తీసుకుని జిల్లా కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల, భానుపురి యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు గుండాల సందీప్‌, తగుళ్ల జనార్దన్‌యాదవ్‌, సంపత్‌నాయుడు, వెంకటేష్‌నాయక్‌, పోలా కర్ణాకర్‌, విద్యార్థులు సాయి, అంజి, శివసాయి, దివ్య, కావ్య, పావని, మనీషా పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T02:18:19+05:30 IST