ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

ABN , First Publish Date - 2022-01-03T06:42:48+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎండగట్టాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కార్యకర్తలతో ఆదివార నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
కార్యకర్తలతో జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎంపీ ఉత్తమ్‌


హుజూర్‌నగర్‌, జనవరి 2: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎండగట్టాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కార్యకర్తలతో ఆదివార నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను అమలుచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం, ఆ తరువాత విస్మరించడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందన్నారు. సాగర్‌ ఆయకట్టులో రైతాంగం సాగుచేసిన వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు ఏ పంట సాగుచేయాలనే దానిపై వారికే స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. ఆయకట్టు ప్రాంతంలో 90 శాతం వరి పంటలే పండిస్తారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయని ప్రభుత్వాలకు అధికారంలో ఉండే నైతిక హక్కు లేదన్నారు. ప్రజలను పాలించే నాయకులు వారి కష్టాలను తీర్చాలన్నారు. సాగర్‌ ఆయకట్టు అంతట రైతులు వరి సాగుచేశారని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించి ధాన్యం కొనుగోలుచేయాలన్నారు. పార్టీని బలోపేతం చేసి రానున్న ఎన్నికలకు సిద్ధం చేయాలని కార్యకర్తలను కోరారు. జూమ్‌ యాప్‌ మీటింగ్‌లో మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, తన్నీరు మల్లికార్జున్‌రావు, యరగాని నాగన్న, అల్లం ప్రభాకర్‌రెడ్డి, ఈడ్పుగంటి సుబ్బారావు, సాముల శివారెడ్డి, కొట్టే పద్మసైదేశ్వరరావు, గోవిందరెడ్డి, పద్మ, గోపాల్‌, మోతీలాల్‌, సంపత్‌రెడ్డి, అంజయ్య, చంద్రమౌళి, కోటేశ్వరరావు, ఎస్‌కె.సైదా, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-03T06:42:48+05:30 IST