వెళ్లిరా గౌరమ్మ

ABN , First Publish Date - 2022-10-04T05:35:50+05:30 IST

ప్రపంచంలో ఉండే అన్ని జాతులకంటే ప్రకృతికి గొప్ప గౌరవాన్ని ఇచ్చిన మనదైౖన సంస్కృతీ, సంప్రదాయ, మానవీయ పండుగ బతుకమ్మ అ

వెళ్లిరా గౌరమ్మ
సూర్యాపేటలో సద్దుల చెర్వు వద్ద సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు

తీరొక్క పూలతో తొమ్మిది రోజులుగా సాగుతున్న రంగుల సింగిడి... బతుకమ్మ పండుగ జిల్లా వ్యాప్తంగా సోమవార ంతో ముగిసింది. ఎంగిలిపువ్వు బతుకమ్మతో మొదలైన పండుగ సద్దుల బతుకమ్మతో పరిసమాప్తమైంది. చివరి రోజు ఆటపాటలతో వేడుకల ప్రాంతాలు మార్మోగాయి. రంగురంగుల పూలవనాన్ని తలపించాయి.   గ్రామం, మండల కేంద్రం, పట్టణం తేడా లేకుండా ప్రతీ ప్రాంతంలో పండుగను మహిళలు ఘనంగా  నిర్వహించారు. వెళ్లి రా గౌరమ్మ అంటూ వేడుక అనంతరం స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. ఆయాచోట్ల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మానవీయ పండుగ బతుకమ్మ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ప్రపంచంలో ఉండే అన్ని జాతులకంటే ప్రకృతికి గొప్ప గౌరవాన్ని ఇచ్చిన మనదైౖన సంస్కృతీ, సంప్రదాయ, మానవీయ పండుగ బతుకమ్మ అని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాటు కుటుంబసభ్యులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జడ్పీ వైస్‌చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌ పాల్గొన్నారు. అర్వపల్లిలో మండలంలో ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించారు. కాసర్లపాడులో సర్పంచ్‌ దబ్బెటి జ్యోతిరాణి మహిళలకు బతుకమ్మ బహుమతులను అందజేశారు. సూర్యాపేట మండలం బాలెంలలో టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి కుటుంబ సభ్యులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. నూతన్‌కల్‌ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో జరిగిన వేడుకల్లో ఎంపీపీ భూరెడ్డి కళావతిసంజీవరెడ్డి, సర్పంచ్‌లు తీగల కరుణశ్రీగిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు. తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో బీజేపీ తుంగతుర్తి నియోజకవర్గ  ఇన్‌చార్జి కడియం రామచంద్రయ్య మహిళలతో కలిసి బతుకమ్మ ఆట ఆడారు. నేరేడుచర్ల విజయదుర్గా దేవాలయంలో లక్కీ మహిళ డ్రా తీసి బహుమతి అందజేశారు. నేరేడుచర్లకు చెందిన పలువురు అమెరికాలోని కాలిఫోర్నియాలో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో అల్గుబెల్లి లీలావతి, అల్గుబెల్లి మేఘన, దొంతిరెడ్డి కవిత, కొణతం సౌజన్య, సింధు, శైలజ పాల్గొన్నారు.

Read more