వైభవంగా నిత్యవిధి కైంకర్యాలు

ABN , First Publish Date - 2022-12-02T00:34:20+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం నిత్యవిధి కైంకర్యాలు ఆగమ శాస్త్రరీతిలో వైభ వంగా నిర్వహించారు.

వైభవంగా నిత్యవిధి కైంకర్యాలు
త్యతిరుకల్యాణోత్సవ పర్వాలు నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, డిసెంబరు 1: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం నిత్యవిధి కైంకర్యాలు ఆగమ శాస్త్రరీతిలో వైభ వంగా నిర్వహించారు. సుప్రభాతంతో ఆరంభమైన నిత్య పూజలు రాత్రి వేళ శయనోత్సవ పర్వాలతో ముగిశాయి. గర్భాలయంలో కొలువుదీరిన స్వయం భూమూర్తులకు, ప్రతిష్టా అలంకారమూర్తులకు అర్చకస్వాముల వేదమం త్రోచ్ఛరణలు, ఆస్థాన విధ్వాంసుల మంగళవాయిద్యాల నడుమ పంచామృ తాలతో అభిషేక పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. స్వామి, అమ్మ వార్లను సహస్రనామ పఠనాలతో తులసీ దళాలతో అర్చనలు నిర్వహిం చారు. ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగమ శాస్త్రరీతిలో నిర్వహిం చారు. సాయంత్రం వేళ ప్రధానాలయ ముఖమండపంలో దర్బారు సేవోత్స వం చేపట్టిన ఆచార్యులు అలంకార వెండి జోడు సేవోత్సవం, సహస్ర నామార్చన పూజలు నిర్వహించారు. కొండపైన అనుబంధ శివా లయంలో రామలింగేశ్వరసామికి, మహామండపంలో స్ఫటిక మూర్తులకు నిత్యవిధి కైంకర్యాలు, నిత్య రుద్రహవన పూజలు స్మార్త సంప్రదాయరీతిలో కొనసా గాయి. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.18,37,699 ఆదా యం సమకూరిందని దేవస్థాన అధికారులు తెలిపారు. కాగా యాదగి రీశుడిని క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శరత్‌బాబు కుటుంబసమేతంగా దర్శించు కు న్నారు. అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, ప్రధానాలయంలోని స్వయంభువులను, ముఖమండపంలో ఉత్సవ మూ ర్తులను దర్శించు కుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అష్టభుజి ప్రా కార మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేయగా, దేవస్థాన అధికా రులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

మొక్కు తీర్చుకున్న ఆర్థిక శాఖ సెక్రెటరీ శ్రీదేవి

అలంకార వెండి జోడుసేవోత్సవంలో రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్రెటరీ, ఐఏఎస్‌ టీకే శ్రీదేవి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. క్షేత్ర సందర్శనకు వచ్చిన ఆమె ముందుగా తిరువీధి సేవోత్సవంలో పాల్గొని గర్భాలయంలోని స్వయం భువులను దర్శించుకున్నారు. ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొనగా ప్రాకార మండపంలో అర్చకులు ఆశీర్వచనం జరిపారు. దేవస్థాన అధికారులు స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాద గిరీశుడి సన్నిధిలో అలంకార వెండి జోడు సేవోత్సవం మొక్కు తీర్చుకునేం దుకు వచ్చినట్టు, ఆలయం పూర్తిగా కృష్ణరాతి శిలలతో అద్భుత రీతిలో పునర్నిర్మాణం జరిపారన్నారు. ఆమె వెంట డీఈవో దోర్భల భాస్కరశర్మ, పర్యవేక్షకులు డీ. సురేందర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:34:23+05:30 IST