మండలం ఇచ్చి మనసును గెలవాలి

ABN , First Publish Date - 2022-09-19T06:03:37+05:30 IST

అమ్మనబోలు ను మండలంగా చేసి ఈ మండల పరిధిలోకి వచ్చే గ్రామాల మనసును దోచే విధంగా ఎమ్మెల్యే చిరుమ ర్తి లింగయ్య చొరవ చూ పాలని మండల సాధన సమితి నేతలు కోరారు.

మండలం ఇచ్చి మనసును గెలవాలి
అమ్మనబోలులో దీక్షలో కూర్చున్న మండల సాధన సమితి బాధ్యులు

నార్కట్‌పల్లి, సెప్టెంబరు 18: అమ్మనబోలు ను మండలంగా చేసి ఈ మండల పరిధిలోకి వచ్చే గ్రామాల మనసును దోచే విధంగా ఎమ్మెల్యే చిరుమ ర్తి లింగయ్య చొరవ చూ పాలని మండల సాధన సమితి నేతలు కోరారు. అమ్మనబోలును మండలంగా ప్రకటించాలనే డిమాండ్‌తో మండల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్ష ఆదివారం నాటికి 57వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మండల సా ధన సమితి నేతలు మాట్లాడుతూ దీక్షలు చేపట్టి దాదాపు 2 నెలలు గడుస్తున్నా మండల ఏర్పాటుపై ఎమ్మెల్యే నుంచి సరైన స్పందన కానరావడం లేదన్నారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి మండల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.  


Read more