గీత వృత్తిపై ఆసక్తి పెంచుకోవాలి

ABN , First Publish Date - 2022-09-19T05:49:08+05:30 IST

ప్రకృతి పానియాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉందని, నీరా కల్లు ఉత్పత్తిపై యువత ఆసక్తి పెంచు కోవాలని మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు.

గీత వృత్తిపై ఆసక్తి పెంచుకోవాలి
తాటిపొట్టి విత్తనాలు నాటుతున్న ఎమ్మెల్యే పైళ్ల, మాజీ ఎంపీ బూర

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 18: ప్రకృతి పానియాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉందని, నీరా కల్లు ఉత్పత్తిపై యువత ఆసక్తి పెంచు కోవాలని మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. మండలంలోని నందనం తాటిఉత్పత్తుల నీరా కేంద్రం ఆవరణలో బీఎల్‌ఆర్‌ ఫౌండేషన్‌, నంద సేవాసమితి ఆధ్వర్యంలో బీహార్‌ తాటిపొట్టి విత్తనాలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ఆదివారం నాటారు. ఈ సందర్భంగా జరిగిన గీత కార్మికుల అవగాహన సదస్సులో మాట్లాడారు. 12నుంచి 15ఫీట్ల ఎత్తుతో 10సంవత్సరాల్లో ఈ చెట్ల ద్వారా కల్లు గీసుకోవచ్చునన్నారు. పొడవైన తాటిచెట్లతో వృత్తి రీత్యా గీత కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారని, తాటి పొట్టిచెట్ల పెంపకం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చునన్నారు. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు, రోడ్ల విస్తరణ తదితర అభివృద్ధి పనులు, రియల్‌ ఎస్టేట్‌ రంగం విస్తరించడంతో వేలాది చెట్లను తొలగించారని, వాటి స్థానంలో కల్లుగీత సొసైటీ సభ్యులు ఈ చెట్లను నాటి సంరక్షించుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. బీహార్‌ నుంచి రూ.3లక్షల60వేలు వెచ్చి ంచి దాదాపు 40వేల మొక్కలను ఎగుమతి చేసుకున్నట్లు తెలిపారు. కుల వృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుంద న్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ హరితహారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తాటి, ఈత, ఖజ్జూర చెట్లను నాటేందుకు చర్యలు తీసు కుంటుందన్నారు. కల్లుగీత కార్మికుల కుటుంబాలు పొట్టితాటి చెట్ల పెంప కంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే నందనంలో రూ.8కోట్లతో నీరా ఉత్పత్తుల కేంద్రం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ, ఏఎంసీ, మునిసిపల్‌ చైర్మన్లు డాక్టర్‌ అమరే ందర్‌, ఎడ్ల రాజేందర్‌రెడ్డి, ఎనబోయిన ఆంజనేయులు, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ ఎస్‌ బీరుమల్లయ్య, సర్పంచ్‌ కడమంచి ప్రభాకర్‌, ఎంపీ టీసీ మట్ట పారిజాత, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌కుమార్‌, సీఐ నాగి రెడ్డి, నాయకులు జనగాం పాండు, వంగాల వెంకన్న, అతికం లక్ష్మీనారా యణ, చందుపట్ల రాజేశ్వర్‌రావు, మట్ట ధనుంజయ్య, నాగెల్లి సత్యనారా యణ, జక్క రాఘవేందర్‌రెడ్డి, ర్యాకల శ్రీనివాస్‌, సిల్వేరు మధు ఉన్నారు.

Read more