అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-11-12T00:12:32+05:30 IST

అమ్మాయిలు ఏ విషయంలోనూ బలహీనులు కాదని, అన్నిరంగాల్లో రాణించాలని సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ ఐఎన్‌సీ సీఈవో యూఎస్‌ జ్యోతి రెడ్డి అన్నారు.

అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
మోటివేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతిరెడ్డి

నల్లగొండ, నవంబరు 11 : అమ్మాయిలు ఏ విషయంలోనూ బలహీనులు కాదని, అన్నిరంగాల్లో రాణించాలని సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ ఐఎన్‌సీ సీఈవో యూఎస్‌ జ్యోతి రెడ్డి అన్నారు. చర్లపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో శుక్రవారం నిర్వహించిన మోటివేషన్‌ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు తమజీవితంలో జరిగిన సంఘటనలు వివరిస్తూ విద్య యొక్క ప్రాధాన్యాన్ని తెలిపారు. మహిళా సాధికారత గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌కె సుల్తానా, వైస్‌ ప్రిన్సిపాల్‌ పద్మ, మందడి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T00:12:32+05:30 IST

Read more