ప్రియురాలి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-29T06:16:10+05:30 IST

ప్రేమించి వివాహానికి ని రాకరించడంతో ఆత్మహత్యయత్నం చేసిన ప్రియురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది.

ప్రియురాలి ఆత్మహత్య
శిరీష (ఫైల్‌)

వివాహానికి నిరాకరించడంతో ఆత్మహత్యాయత్నం

చికిత్స పొందుతూ మృతి 

మర్రిగూడ, సెప్టెంబరు 28: ప్రేమించి వివాహానికి ని రాకరించడంతో ఆత్మహత్యయత్నం చేసిన ప్రియురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్‌ఐ సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ మండలం నామాపురం గ్రామానికి చెందిన చెరుకు శిరీష(21)కు అదే గ్రామానికి చెందిన చెనగోని సత్తయ్య కుమారుడు విక్రంతో రెండేళ్ల క్రితం  పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.  విక్రం ఇంటర్‌ వరకు చదివి అదే గ్రామంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, శిరీష మాల్‌లోని ఓ ప్రైవే టు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. శిరీషను పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులను ఒ ప్పించాలని విక్రం కాలం వెళ్లదీస్తున్నాడు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని త నను పెళ్లి చేసుకోవాలని ఈ నెల 18న తన ఇంటి ఎదురుగా నివసించే ప్రియుడు వి క్రం ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రుల ఎదుటే నిలదీసింది. అతడు పెళ్లికి నిరాకరించడంతో విక్రం ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ స మయంలో శిరీష తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో గ్రామస్థులు శిరీష ను చికిత్స నిమిత్తం  హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో తమ కు మార్తె మృతి చెందిందని తల్లిదండ్రులు  ఇందిర-అంజయ్య దంపతులు విలపించారు.  శిరీష మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. శిరీష మృతికి, విక్రం, అతడి తల్లిదండ్రులే కారణమని ఆమె సోదరుడు రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదాబాబు తెలిపారు.


Read more