గండిని యుద్ధప్రాతిపదికన పూడ్చివేయాలి

ABN , First Publish Date - 2022-09-19T06:07:31+05:30 IST

నాగార్జునసాగర్‌ కాల్వకు ప డిన గండిని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అధికారులను ఆదేశించారు.

గండిని యుద్ధప్రాతిపదికన పూడ్చివేయాలి
పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్సీ

 ఎమ్మెల్సీ కోటిరెడ్డి

నిడమనూరు, సెప్టెంబరు 18: నాగార్జునసాగర్‌ కాల్వకు ప డిన గండిని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని ముప్పారం-వేంపాడ్‌ గ్రామాల నడుమ సాగర్‌ ఎడమ కాల్వకు పడిన గండి మరమ్మతుల పనులను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పను ల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, సకాలంలో వరి పొలాలకు సాగు నీరు అందే విధంగా పనులు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట మండల రైతుబంధు కోఆర్డినేటర్‌ అంకతి వెంకటరమణ, బైరెడ్డి వెంకట్‌రెడ్డి, జానయ్య, చినవీరయ్య, రాంబబాబు, పెద్దిరాజు, సైదులు,  సుజయ్‌, ధనపాల్‌రెడ్డి, పరమేశ, అనిల్‌, జగదీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.  


Read more