వాగు దాటుతూ గల్లంతు

ABN , First Publish Date - 2022-10-02T05:47:13+05:30 IST

వాగు దాటుతూ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన మండలంలోని తాడ్వాయి సమీపంలో శనివారం చోటుచేసుకుంది.

వాగు దాటుతూ గల్లంతు
ఎస్‌కె సైదులు

మునగాల, అక్టోబరు 1 : వాగు దాటుతూ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన మండలంలోని తాడ్వాయి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ బాలునాయక్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాడ్వాయి గుర్రప్ప వాగులో శనివారం ఒ వ్యక్తి గల్లంతు అయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాడ్వాయి గ్రామానికి చెందిన ఎస్‌కె సైదులు(35) జీవనోపాధి కోసం కుటుంబ సభ్యులతో వెళ్లి చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో జీవిస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామం తాడ్వాయికి వెళ్లేందుకు ఆటోలో బయలుదేరాడు. ఈ క్రమంలో గ్రామానికి చేరువలోని గుర్రప్పవాగు వద్ద ఆటో దిగి వాగు దాటేందుకు ప్రయత్నించాడు. అయితే వాగులో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వాగు దాటలేక గల్లంతయ్యాడు. వాగు అవతలి వైపున ఉన్న వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సైదులు కోసం గాలిస్తున్నారు.


Read more