ఆలయాల అభివృద్ధికి నిధులు

ABN , First Publish Date - 2022-02-19T06:28:20+05:30 IST

దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. మండలంలోని చీదెళ్ల గ్రామంలో లక్ష్మీతిరుపతమ్మ గోపయ్య స్వా

ఆలయాల అభివృద్ధికి నిధులు
చీదెళ్లలో ఒంగోలు ఎద్దుల పరుగు పందేలను ప్రారంభిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

పెన్‌పహాడ్‌, ఫిబ్రవరి 18 :  దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. మండలంలోని చీదెళ్ల గ్రామంలో లక్ష్మీతిరుపతమ్మ గోపయ్య స్వాముల జాతర సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఒంగోలు ఎద్దుల పరుగు పందేలను మంత్రి ప్రారంభించారు. ఆయన వెంట ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, సర్పంచ్‌ పరెడ్డి సీతారాంరెడ్డి, ఎంపీటీసీ జూలకంటి వెంకటరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానికిరాంరెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్‌ గొట్టిపర్తి గోపయ్య, పాల్గొన్నారు. దోసపహాడ్‌ గ్రామంలో సీతారామాంజనేయస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా జలాభిషేకం నిర్వహించారు. శనివారం నిర్వహించే ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సర్పంచ్‌ దొంగరి సుధాకర్‌, దొంగరి యుగంధర్‌ తెలిపారు. గాజులమల్కాపురం గ్రామంలో మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర మూడోరోజుకు చేరింది. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బండి దనమ్మ, దేవాలయ కమిటీ చైర్మన్‌ నాతాల వెంకటరామిరెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 

యోగానందలక్ష్మీనృసింహుడి గరుడోత్సవం

అర్వపల్లి మండలకేంద్రంలోని యోగానంద లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవాన్ని నిర్వహించారు. స్వామిఅమ్మవార్లను పల్లకిపై ఊరేగింపు చేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, ఆలయ చైర్మన్‌ చిల్లంచర్ల విద్యాసాగర్‌, కాప వెంకటేశ్వర్‌రావు, మొరిశెట్టి ఉపేందర్‌, బైరబోయిన రామలింగయ్య పాల్గొన్నారు. కుమ్మరిగూడెం గ్రామంలో జాన్‌పహాడ్‌ సైదులుబాబా ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గంధాన్ని ఎం పీపీ మన్నె రేణుకలక్ష్మినర్సుయాదవ్‌ దర్గా వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు.కార్యక్రమంలో సర్పంచ్‌ సాగర్ల బుచ్చయ్య, ఉపసర్పంచ్‌ శనిగారపు సుశీలసత్తయ్య తదితరులు పాల్గొన్నారు. 

జెర్రిపోతులగూడెంలో భారీ ప్రభల ప్రదర్శన

చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం, కొండా పురం గ్రామాల్లో కనకదుర్గమ్మ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. జెర్రిపోతులగూడెం గ్రామ ంలో సీపీఐ ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శనలు, డ్యాన్స్‌బేబీ డ్యాన్స్‌షోలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ లైటింగ్‌ ప్రభలను ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ ప్రశాంతికోటయ్య, జడ్పీటీసీ శిరీషానాగేంద్రబాబు, సర్పంచ్‌లు సుజాతాశ్రీనివా్‌సరెడ్డి, సుగుణమ్మ నర్సింహారావు, ఎంపీటీసీలు పద్మ వెంకటరెడ్డి, సైదమ్మ లింగయ్య పాల్గొన్నారు. 

చిల్పకుంట్లలో జలాభిషేకం

నూతన్‌కల్‌ మండలంలోని చిల్పకుంట్ల గ్రామంలో బొడ్రాయి పునఃప్రతిష్ఠ, ముత్యాలమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవతామూర్తుల విగ్రహాలకు, శివలింగానికి మహిళలు జలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, సర్పంచ్‌ కొంపెల్లి రాంరెడ్డి, ఎంపీటీసీ బత్తుల యాదమ్మ సూరయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. 

కొండదిగిన స్వామి

హుజూర్‌నగర్‌ పట్టణంలోని ఫణిగిరిగట్టుపై శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా దోపు ఉత్సవం నిర్వహించారు.స్వామివారిని ఎమ్మెల్యే సైదిరెడ్డి సతీమణి రజితారెడ్డి, ఆర్డీవో వెంకారెడ్డి, చైర్‌పర్సన్‌ గెల్లి అర్చనరవి, కుటుంబసభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. చక్రస్నానం అనంతరం పెరుమాళ్ళను పల్లకిలో పట్టణంలోని రామాలయానికి తీసుకెళ్లారు. అనంతరం దేవాలయంలో కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో గుజ్జుల కొండారెడ్డి, రామిశెట్టి రాము, నర్సింహమూర్తి పాల్గొన్నారు.

మట్టపల్లిలో వైభవంగా నిత్యకల్యాణం

మఠంపల్లి మండలంలోని మట్టపల్లి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో స్వామివార్లకు నిత్యశాశ్వత కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజతో పాటు కల్యాణోత్సవంలో మాంగల్యధారణ, తలంబ్రాలు ఘట్టాలను నిర్వహించారు. 

జాతర పోస్టర్‌ ఆవిష్కరణ

సూర్యాపేట(కలెక్టరేట్‌) : పెన్‌పహాడ్‌ మండలంలోని నాగులపహాడ్‌ త్రికుఠేశ్వర ఆలయ జాతర పోస్టర్లను మంత్రి జగదీ్‌షరెడ్డి ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో  నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీవై్‌సచైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, పెన్‌పహాడ్‌ ఎంపీపీ నెమ్మాది బిక్షం, నాయకులు ఉప్పల ఆనంద్‌, కొండా జానకిరాములుగౌడ్‌, నగేష్‌, చెన్ను శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-19T06:28:20+05:30 IST