భార్య కాపురానికి రావడంలేదని బలవన్మరణం

ABN , First Publish Date - 2022-04-05T06:19:29+05:30 IST

భార్య కాపురానికి రావడం లేదనే మనోవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య కాపురానికి రావడంలేదని బలవన్మరణం


వలిగొండ, ఏప్రిల్‌ 4: భార్య కాపురానికి రావడం లేదనే మనోవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.  కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వలిగొండ మండలంలోని జంగారెడ్డిపల్లికి చెందిన బొంత ఎల్లయ్య కుమారుడు బొంత శేఖర్‌ (28) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడేళ్ల క్రితం రామన్నపేట మండలం ఇంద్రపాలనగరానికి చెందిన యువతితో వివాహమైంది. వీరికి సంతానం కలుగకపోవడంతో భార్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాపురానికి రాకపోవడంతో మనోవేదనకు గురై మానసికంగా బాధపడడుతున్న శేఖర్‌ ఆదివారం రాత్రి తన ఇంట్లో పురుగుమందుతాగి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. శేఖర్‌ సోదరుడు నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రభాకర్‌ తెలిపారు.


Read more