గాంధీ అడుగుజాడల్లో నడవాలి

ABN , First Publish Date - 2022-08-17T05:47:16+05:30 IST

తమ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు గాంధీ అడుగు జాడల్లో నడవాలని రాష్ట్ర విద్యుత శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి కోరారు.

గాంధీ అడుగుజాడల్లో నడవాలి
చౌటుప్పల్‌లో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి

 విద్యుత శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి

చౌటుప్పల్‌, ఆగస్టు 16: తమ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు గాంధీ అడుగు జాడల్లో నడవాలని రాష్ట్ర విద్యుత శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి కోరారు. మండల కేంద్రంలో మంగళవారం జాతీయ స్వాత్రంత్య వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక గీతాలాపాన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతీయుడు మువ్వన్నెల జెండాను ఎగురవేసి సగర్వంగా చెయ్యెత్తి జై కొడుతున్నాడంటే అది మహనీయుడు గాంధీజీ చేసిన త్యాగం వల్లనే అని కొనియాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల చరిత్రను కొంతమంది దుర్మార్గులు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి కోరారు. అహింస స్ఫూర్తితో సాధించిన స్వాతంత్య్రం గురించి భావితరాలకు తెలియజెప్పాలనదేఏ ముఖ్యమంతి కేసీఆర్‌ సంకల్పమని ఆయన తెలిపారు. కార్యక్రమంల మున్సిపల్‌ చైర్మన వెనరెడ్డి రాజు, ఆర్డీఓ సూరజ్‌కుమార్‌, సింగిల్‌విండో చైర్మన చింతల దామోధర్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన బొడ్డు శ్రీనివా్‌సరెడ్డి, వైస్‌  చైర్మన చెన్నగోని అంజయ్యగౌడ్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా సామూహిక గీతాలాపన కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కార్యక్రమం అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.


Updated Date - 2022-08-17T05:47:16+05:30 IST