పచ్చదనం పెంపుపై దృష్టి సారించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-06-07T06:51:43+05:30 IST

పల్లె ప్రగతిలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉందని, నిర్లక్ష్యం వహిస్తే చర్య లు తప్పవని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.

పచ్చదనం పెంపుపై దృష్టి సారించాలి : కలెక్టర్‌
అనంతారంలో పల్లెప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

పెన్‌పహాడ్‌, జూన్‌ 6 : పల్లె ప్రగతిలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉందని, నిర్లక్ష్యం వహిస్తే చర్య లు తప్పవని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చద నం పెంపుపై ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని అన్నారు. మండలంలోని అనంతారం, పోట్లపహాడ్‌ గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాల నిర్వహణను ఆయన సోమవారం పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలతో పాటు రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. హరితహారం ప్రారంభం నాటికి అన్ని పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలను సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, వీఽధిదీపాల నిర్వహణను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో వెంకటచారి, మండల ప్రత్యేధికారి రాంపతి నాయక్‌, తిరుపతయ్య, రాంబాబు, సర్పంచ్‌లు శ్రీనివా్‌సరెడ్డి, పుష్పవతి, ఎంపీటీసీలు సైదమ్మ, రేవతి పాల్గొన్నారు.

Updated Date - 2022-06-07T06:51:43+05:30 IST