చేప పిల్లల వాహనం అడ్డగింత

ABN , First Publish Date - 2022-11-28T01:45:41+05:30 IST

చెరువుల్లో నాణ్యమైన చేప పిల్లలను కాంట్రాక్టర్‌ పోయడంలేదంటూ ఎంపీడీవో కార్యాలయానికి ఆదివారం వచ్చిన చేప పిల్లల వాహనాన్ని మత్స్యకారులు అడ్డుకున్నారు.

చేప పిల్లల వాహనం అడ్డగింత

ఆత్మకూర్‌(ఎస్‌), నవంబరు 27: చెరువుల్లో నాణ్యమైన చేప పిల్లలను కాంట్రాక్టర్‌ పోయడంలేదంటూ ఎంపీడీవో కార్యాలయానికి ఆదివారం వచ్చిన చేప పిల్లల వాహనాన్ని మత్స్యకారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకార్శికుల అభివృద్ధి కోసం అంద జేస్తున్న పథకంలో కాంట్రాక్టర్‌ నాణ్యత పాటించడం లేదని ఆరోపించారు. చేప పిల్లలను చెరువుల్లో సక్రమంగా పోయకుండా నామమాత్రంగా పోసి త్వరలో మళ్లీ వస్తాయని చెబుతూ మిగతా పిల్లలను ఇవ్వడంలేదన్నారు. చేప పిల్లలు చిన్నవిగా ఉన్నాయని, నాణ్యత లేవని వాహనాలను వెనక్కి పంపారు. కార్యక్ర మంలో కందగట్ల సొసైటీ చైర్మన్‌ కర్ణాకర్‌ , మత్స్యకారులు చెక్కల వీరభద్రయ్య, ఎల్లయ్య, శ్రీను, వెంకటేశ్వర్లు, మల్లయ్య, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T01:45:46+05:30 IST