ప్రభుత్వాస్పత్రిలో మంటలు

ABN , First Publish Date - 2022-04-24T05:54:24+05:30 IST

నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో మంటలు చెలరేగాయి.

ప్రభుత్వాస్పత్రిలో మంటలు
ఆస్పత్రిలో మంటలు చెలరేగిన ప్రాంతం

నాలుగు గంటలు నిలిచిన విద్యుత సరఫరా 

జనరేటర్‌తో ఆస్పత్రికి సరఫరా పునరుద్ధరణ

నల్లగొండ అర్బన, ఏప్రిల్‌ 23: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో మంటలు చెలరేగాయి. దీంతో నాలుగు గంటల పాటు ఆస్పత్రికి విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లాకేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని పోస్టుమార్టం గది వెనకాల శనివారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో పెద్దఎత్తున పొగతో కూడుకున్న మంటలు చెలరేగాయి. పక్కనే ఉ న్న నివాసగృహాల వారు గమనించి ఫైర్‌స్టేషనకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చి వారు మంటలను ఆర్పివేశారు. ఆస్పత్రిలో మంటలు వ్యాపించిన పక్కనే సబ్‌స్టేషన ఉంది. చుట్టు పక్కల ని వాస గృహాలున్నాయి. సబ్‌స్టేషన చుట్టూ ప్రహరీ ఉండటంతో మం టలు సబ్‌స్టేషనలోకి వ్యాపించలేదు. ఆస్పత్రి మొత్తానికి ఇక్కడి నుంచే విద్యుత సరఫరా అవుతుంది. ట్రాన్సఫార్మర్‌ సమీపంలో మంటలు అంటుకోవడంతో గంట పాటు ఆస్పత్రికి విద్యుత సరఫ రా నిలిచింది. అనంత రం జనరేటర్‌ సా యంతో విద్యుత సరఫరా చేసినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లచ్చునాయక్‌ తెలిపా రు. విద్యుత అధికారు లు, సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆ స్పత్రిలో విద్యుత సరఫరా నిలిచింది. పక్కనే ఉన్న కాలనీలకు కూ డా విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చెత్తకు పెట్టిన నిప్పు వల్లే ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆస్పత్రి శానిటేషన సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని సమీప నివాస గృహాల వారు ఆరోపించారు. ట్రాన్సఫార్మర్‌ జంపర్లు మాత్రమే కాలిపోయాయని ఏఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కాలిపోయిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పెద్దగా ఆస్తినష్టం జరగలేదన్నారు. 

Updated Date - 2022-04-24T05:54:24+05:30 IST