దోషాల నివారణకే పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-09-26T07:21:22+05:30 IST

: మట్టపల్లి క్షేరత్రంలో అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది చేసిన దోషాలు, అపచారాల నివారణకు ప్రతి ఏటా పవిత్రోత్సవాలను ప్రతిఏటా నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌లు తెలిపారు.

దోషాల నివారణకే పవిత్రోత్సవాలు
మట్టపల్లి క్షేత్రంలో పూజలు చేస్తున్న వేద పండితులు

ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌లు 

మఠంపల్లి, సెప్టెంబరు 25: మట్టపల్లి క్షేరత్రంలో అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది చేసిన దోషాలు, అపచారాల నివారణకు ప్రతి ఏటా  పవిత్రోత్సవాలను ప్రతిఏటా నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌లు తెలిపారు. ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న  పవిత్రోత్సవాలను వేద పండితులు ఆదివారం  శాస్ర్తోక్తంగా నిర్వహించారు. పూజల అనంతరం రాత్రి ఏడు గంటలకు  స్వామివారికి ఉత్సవం, అనంతరం మహాశాంతి హోమం తదితర కార్యక్రమాలను యాజ్ఞీకులు బొర్రా వాసుదేవశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలు విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు,  అర్చకులు తుమాటి శ్రీనివాసాచార్యులు, కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, రామాచార్యులు, లక్ష్మణచార్యులు, బ్రహ్మాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Read more