చీకట్లో భయం భయంగా..

ABN , First Publish Date - 2022-01-03T06:30:28+05:30 IST

జిల్లా కేంద్రం భువనగిరి ప్రధాన రహదారుల్లో వీధి లైట్లు వెలగకపోవడంతో పారిశుధ్య కార్మికులు చీకట్లో భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు.

చీకట్లో భయం భయంగా..

వీధిలైట్లు లేకపోవడంతో పారిశుధ్య కార్మికుల ఇక్కట్లు


(ఆంధ్రజ్యోతి, యాదాద్రి): జిల్లా కేంద్రం భువనగిరి ప్రధాన రహదారుల్లో వీధి లైట్లు వెలగకపోవడంతో పారిశుధ్య కార్మికులు చీకట్లో భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. అసలే చలికాలం, ఆపై మంచు కురుస్తుండటంతో ఎదురు గా వచ్చే వాహనదారులకు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకునే అవకా శం ఉందని కార్మికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను తరలిం చే వాహనాలు, తమ బైకుల లైట్ల వెలుతురు సహాయంతో అరచేతిలో ప్రా ణాలు పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నామని కార్మికులు వాపోతున్నారు.


Read more