వ్యర్థాలతో పొలాలు నాశనం: రైతులు

ABN , First Publish Date - 2022-09-08T06:31:38+05:30 IST

సువెన్‌ ఫార్మా కంపెనీ వ్యర్థాలను మూసీ కాల్వలో వదులుతండటంతో పొలాలు నాశనం అవుతున్నాయని రైతులు ధ్వజమెత్తారు.

వ్యర్థాలతో పొలాలు నాశనం: రైతులు
సువెన్‌ ఫార్మా పరిశ్రమ ఎదుట అందోళన చేస్తున్న రైతులు

సూర్యాపేట రూరల్‌, సెప్టెంబరు 7: సువెన్‌ ఫార్మా కంపెనీ వ్యర్థాలను మూసీ కాల్వలో వదులుతండటంతో పొలాలు నాశనం అవుతున్నాయని రైతులు ధ్వజమెత్తారు. ఈ మేరకు సూర్యాపేట మునిసిపాలిటీ పరిధిలోని దాసాయిగూడెం సమీపంలోని సువెన్‌ ఫార్మా కంపెనీ ఎదుట వస్రాంతండా, రాంలాతండా, జాటోత్‌ తండాల రైతులు ఆందోళన చేపట్టారు. ప్రతీ సంవత్సరం వ్యర్థాలను కాల్వలో వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరగంట ఆందోళన తర్వాత కంపెనీ సెక్యూరిటీ విభాగం వారు ఆందోళన విరమించాలని కోరడంతో వెళ్లిపోయారు. ఈ విషయంపై సువెన్‌ కంపెనీ హెడ్‌ శేషగిరిరావు వివరణ ఇస్తూ ప్రతిఏడాది గుర్తుతెలియని వ్యక్తులు ట్యాంకర్లతో వ్యర్థాలను కాల్వలో వదులుతున్నారు. గత ఏడాది కూడా ఇలానే జరిగితే కంపెనీ నుంచి ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ పెట్టి గస్తీ నిర్వహించి పట్టుకున్నామన్నారు. సువెన్‌ కంపెనీ నుంచి ఎలాంటి వ్యర్థాలు బయటకు రావని, పొల్యూషన్‌ కంట్రోల్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని అన్నారు. 




Updated Date - 2022-09-08T06:31:38+05:30 IST