రైతులకు సౌకర్యాలు కల్పించాలి

ABN , First Publish Date - 2022-11-08T01:13:45+05:30 IST

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చే రైతులకు సౌకర్యాలు కల్పించాలని డీఎ్‌సవో వీ. వెంకటేశ్వర్లు అదేశించారు.

రైతులకు సౌకర్యాలు కల్పించాలి
మాడ్గులపల్లిలో రైతులతో మాట్లాడుతున్న డీఎ్‌సవో వెంకటేశ్వర్లు

నల్లగొండ రూరల్‌/ మాడ్గులపల్లి, నవంబరు 7: కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చే రైతులకు సౌకర్యాలు కల్పించాలని డీఎ్‌సవో వీ. వెంకటేశ్వర్లు అదేశించారు. మండలంలోని బత్తాయి, జి చెన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవా రం అకస్మికంగా సందర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కోసం నీళ్లు, కూర్చోవడానికి బెంచీలు, వర్షం వచ్చినప్పుడు, మెడికల్‌ కిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ప్రభుత్వం సుచించిన మేరకు రైతులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను వోపీఎంఎ్‌సలో తప్పని సరి నమోదు చేయాలన్నారు. ఆయ న వెంట ఎసీఎ్‌సవో నిత్యానందం, డీఎం నాగేశ్వర్‌రావు, లింగస్వామి తదితరులు ఉన్నారు. మాడ్గులపల్లిలోని పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఎ్‌సవో వెంకటేశ్వర్లు పరిశీలించా రు. ప్రభుత్వం గన్నీ బ్యాగుల కొరత, లారీల సమస్య లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ప్రభుత్వం ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీఎం నాగేశ్వర్‌రావు, డీటీసీఎస్‌ రామకృష్ణారెడ్డి, సీఈవో భిక్షమయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-11-08T01:13:45+05:30 IST

Read more