పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2022-06-07T06:08:47+05:30 IST

ప్రస్తుత వర్షాకాలంలో సాగు చేసే పంటలపై మండలాల్లోని వ్యవసాయ శాఖ విస్తరణాధికారులు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డీఏవో కె.అనురాధ కోరారు.

పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి

  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ 

ఆలేరు, జూన 6: ప్రస్తుత వర్షాకాలంలో సాగు చేసే పంటలపై మండలాల్లోని వ్యవసాయ శాఖ విస్తరణాధికారులు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డీఏవో కె.అనురాధ కోరారు.  ఆలేరులోని వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయంలో వానాకాలం సన్నాహక కార్యక్రమంపై సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధికారి మాట్లాడారు.  వానాకాలంలో పాటించాల్సిన మెలకువల గురించి మండల అధికారులు రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. పత్తి కంది సాగును ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టేలా కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ డివిజన అధికారి బి.వెంకటేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన శిక్షణకు ఆలేరు, మోత్కూరు, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు, గుండాల మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు హాజరయ్యారు. 

Updated Date - 2022-06-07T06:08:47+05:30 IST