నానో డీఏపీ వినియోగంతో రైతులకు మేలు

ABN , First Publish Date - 2022-09-13T05:49:19+05:30 IST

వరి పొలాల్లో నానో డీఏపీ లిక్విడ్‌ వినియోగంతో రైతులకు ఖర్చు తగ్గడమే కాకుండా భూసారం మెరుగుపడుతుందని కేవీకే ఇన్‌చార్జి కోఆర్డినేటర్‌ బి.లవకుమార్‌ తెలిపారు.

నానో డీఏపీ వినియోగంతో రైతులకు మేలు
వరి పైరును పరిశీలిస్తున్న కేవీకే శాస్త్రవేత్తలు

గరిడేపల్లి, సెప్టెంబరు 12: వరి పొలాల్లో నానో డీఏపీ లిక్విడ్‌ వినియోగంతో రైతులకు ఖర్చు తగ్గడమే కాకుండా భూసారం మెరుగుపడుతుందని కేవీకే ఇన్‌చార్జి కోఆర్డినేటర్‌ బి.లవకుమార్‌ తెలిపారు. సోమవారం మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలోని వరి పొలాల్లో లిక్విడ్‌ నానో పిచికారిని పరిశీలించి మాట్లాడారు. వరి నాట్లు వేసిన 25రోజుల తర్వాత ఎకరానికి 2.5 నుంచి 3.0 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. పిచికారి చేసిన తర్వాత రెండు గంటల వరకు వర్షం పడకుండా ఉంటే చాలని అన్నారు. కార్యక్రమంలో టి.సుధాక ర్‌రెడ్డి, కేవీకే శాస్త్రవేత్తలు సీహెచ్‌ నరేష్‌, కిరణ్‌, డి.ఆదర్శ్‌,  ఫీల్డ్‌ ఆఫీసర్లు మల్లికార్జున్‌, శ్రావణ్‌, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-13T05:49:19+05:30 IST