పాము కాటుతో రైతు మృతి

ABN , First Publish Date - 2022-10-01T06:34:15+05:30 IST

మండలంలోని శాంతినగర్‌ గ్రామంలో రైతు పాముకాటుతో మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రైతు సింగారెడ్డి గోపాల్‌రెడ్డి(53)శుక్రవారం తన చేనులో గడ్డి కోస్తుండగా పాము కరించింది.

పాము కాటుతో రైతు మృతి
గోపాల్‌రెడ్డి (ఫైల్‌ ఫొటో)

అనంతగిరి, సెప్టెంబరు 30: మండలంలోని శాంతినగర్‌ గ్రామంలో రైతు పాముకాటుతో మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రైతు సింగారెడ్డి గోపాల్‌రెడ్డి(53)శుక్రవారం తన చేనులో గడ్డి కోస్తుండగా పాము కరించింది. సమీపంలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మి కులు గుర్తించి ఆయనను కోదాడలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రైతు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పిడుగుపాటుకు రైతు ..

మేళ్లచెర్వు: పిడుగుపాటుకు రైతు మృతి చెందాడు. ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన షేక్‌ ఆలెసైదా(38) శుక్రవారం తమ వ్యవసాయ భూమిలో పశువులను మేపుతుండగా, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. .మృతుని సోదరుడు షేక్‌ అజరత్‌ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Read more